యూనివర్సిటీలో చిరుత హల్చల్.. పట్టించుకోని ఫారెస్ట్ సిబ్బంది.. విద్యార్థులు హడల్! - బెంగుళూ జ్ఞానభారతి విశ్వవిద్యాలయ క్యాంపస్ చిరుత
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని బెంగళూరు యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. క్యాంపస్లో ఓ చిరుత సంచారం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు, యూనివర్సిటీ సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది యాజమాన్యం. అయితే కొన్నిరోజుల క్రితం ఎన్ఎస్ఎస్ భవన్ వెనుక ఉన్న అడవిలో చిరుతను చూసినట్లు కొందరు వ్యక్తులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా యూనివర్సిటీ ఛాన్సలర్ అటవీ శాఖ అధికారులకు లేఖ రాసినా ఎటువంటి స్పందన రాలేదు.