చేపలు పట్టడంలో శిబు స్టైలే వేరు.. సముద్రంలోకి డైవ్ చేసి బల్లెంతో వేట - kerala gun fisher shibu
🎬 Watch Now: Feature Video
మన దేశంలో తీరప్రాంత ప్రజలకు చేపల వేటే జీవనాధారం. అందుకు చాలా మంది తమ సంప్రదాయ పద్ధతులను కొనసాగిస్తుంటారు. కానీ చేపల పట్టడంలో కేరళలోని కొల్లాంకు చెందిన శిబు జోసెఫ్ స్టైలే వేరు. స్పెషల్ స్పియర్ గన్ను ఉపయోగించి శిబు చేపలను పట్టుకుంటాడు. డైవింగ్‌లో నిపుణుడు అయిన అతడు.. సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ స్పియర్ గన్‌తో రకరకాల చేపలను ఫిషింగ్ చేస్తున్నాడు. ఆ చేపలను విక్రయించి మంచి డబ్బులును కూడా సంపాదిస్తున్నాడు. అయితే నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోకుండా తనను ఎవరూ అనుకరించవద్దని శిబు కోరుతున్నాడు. అంతే కాకుండా తన ఫిషింగ్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST