రెచ్చిపోయిన దొంగలు.. గన్స్‌తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య - బిహార్ వైశాలి చోరీ న్యూస్
🎬 Watch Now: Feature Video
బిహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. వైశాలి జిల్లాలోని హజిపుర్ పట్టణంలో ఓ ఆభరణాల దుకాణాన్ని దోచేశారు. ఐదారుగురు ఆయుధాలతో వచ్చి చోరీకి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నగల దుకాణం యజమానిని దుండగులు చంపేశారు. దొంగలను నిలువరించేందుకు యజమాని సునీల్ కుమార్ ప్రయత్నించగా.. ఆయనకు బుల్లెట్ గాయాలు అయినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన నీలమ్ జ్యుయలరీ పట్టణ నడిబొడ్డున ఉండటం గమనార్హం. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన జూన్ 22న రాత్రి 8 గంటలకు జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST