దెయ్యాల ముసుగులతో శ్మశానంలో కొత్త ఏడాది వేడుకలు - 2023 new year celebrations news
🎬 Watch Now: Feature Video
పంజాబ్ అమృత్‌సర్‌లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. వికృత రూపాలతో ఉన్న మాస్క్‌లను ముఖానికి ధరించిన యువకులు శ్మశానంలోని ఓ ఊడలమర్రికి వేలాడారు. సమాధుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. తర్వాత ఓ సమాధి వద్ద కేక్‌కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. ఇడియట్ క్లబ్ సభ్యులు ఇలా శ్మశానంలో వినూత్నంగా వేడుకలు జరుపుకొన్నారు. రాయ గ్రామంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. చేతబడి, బాణామతి మంత్రతంత్ర విద్యలను ప్రజలు నమ్ముతుంటారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలేందుకు ఇలా చేసినట్లు ఇడియట్‌క్లబ్ సభ్యులు తెలిపారు. 25ఏళ్ల క్రితం డిసెంబర్30న సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంధ విశ్వాసాలను పారదోలేందుకు ఇడియట్ క్లబ్ ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఇదే శ్మశానంలో క్లబ్ స్థాపించినట్లు తెలిపారు. క్లబ్ స్థాపించి 25ఏళ్లు కావడంతో పాటు కొత్త ఏడాదికి ఒకరోజే ఉండటంతో ముందుగానే వేడుకలు జరిపినట్లు క్లబ్‌సభ్యులు తెలిపారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిజమైన పిశాచాలు అంధవిశ్వాసాలు, తీవ్రవాదం, డ్రగ్స్, అవినీతి, లంచం అని తెలిపారు. అందుకు గుర్తుగా ఈ మాస్క్‌లు ధరించినట్లు ఇడియట్ క్లబ్‌సభ్యులు వివరించారు
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST