మహిళ పైనుంచి వెళ్లిన గూడ్స్ రైలు.. లక్కీగా.. - మహిళపై నుంచి గూడ్స్ రైలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17724785-601-17724785-1676089556301.jpg)
బిహార్లోని గయా జిల్లాలో ఓ మహిళ.. పెను ప్రమాదం నుంచి బయటపడింది. టంకుప్ప రైల్వేస్టేషన్లో వినీత కుమారి అనే ఉపాధ్యాయురాలు.. గూడ్స్ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో ఒక్కసారిగా రైలు కదిలింది. వెంటనే ఆమె తెలివిగా వ్యవహరించి పట్టాలపై పడుకుంది. ఆమెపై నుంచి గూడ్స్ రైలు బోగీలన్నీ వెళ్లాయి. ఆ విధంగా తన ప్రాణాలను కాపాడుకుంది. గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST