నీటిపై తేలియాడే వంతెన.. సముద్రంపై నడిచేయండిక... - మాల్పె ఫ్లోటింగ్ బ్రిడ్జ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2022, 11:21 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

floating bridge udupi: కర్ణాటకలోని ఉడుపిలో నీటిపై తేలియాడే వంతెన ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్. నగరంలోని మాల్పే బీచ్​లో శుక్రవారం ఈ వంతెనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారు. తేలియాడే వంతెన వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘుపతి.. అధికారులను ఆదేశించారు. ఎల్లప్పుడూ 20-25 మంది గార్డ్స్ ఇక్కడ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి తేలియాడే వంతెన ఇదే కావడం విశేషం. సముద్రంలో 100 మీటర్ల దూరం వరకు ఈ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లొచ్చు. కేరళలోని బేపోరేలో ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇదివరకు ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.