పానీపూరీ బండిపైకి దూసుకెళ్లిన స్కార్పియో.. బాలుడు సహా ఇద్దరు మృతి - స్కార్పియో పానీపూరి ప్రమాదం
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్ ధన్బాద్ జిల్లాలోని తూర్పు బసురియాలో స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. ఓ పాఠశాల సమీపంలో ఉన్న పానీపూరీ బండిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాహనం ధాటికి పానీపూరీ బండి వద్ద ఉన్న ఓ యువకుడు ఎగిరిపడ్డాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఓ ట్రాలీ ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో స్కార్పియో వాహనం అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పదేళ్ల చోటు కుమార్ తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చోటు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. అయితే, స్థానికులు వెంబడించి డ్రైవర్ను పట్టుకున్నట్లు సమాచారం. పోలీసులు రంగంలోకి దిగి.. కారును స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST