ప్రధాని మోదీ మీటింగ్‌లో పాము కలకలం భయంతో కుర్చీలెక్కిన ప్రజలు - గుజరాత్ భరూచ్ మోదీ మీటింగ్
🎬 Watch Now: Feature Video
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీటింగ్‌లో ఓ పాము కలకలం సృష్టించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భరూచ్‌లోని జంబుసర్ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో ముందు వరుసలో కూర్చున్న వారికి ఓ పాము కనిపించింది. దీంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కొందరు భయంతో కుర్చీలపైకి ఎక్కి నిల్చున్నారు. ప్రధాని సభా ప్రాంగణానికి రాకముందే ఈ గందరగోళం జరిగింది. అక్కడే ఉన్న ఓ పోలీసు ధైర్యం చేసి పామును పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మోదీ మీటింగ్‌కు హాజరై ప్రసంగించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST