'పుష్ప' డైలాగ్‌తో పరిశుభ్రతపై అవగాహన.. ఎక్కడంటే? - అంభికాపుర్ మున్సిపాలిటీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Chhattisgarh Cleanliness Drive: ఛత్తీస్‌గఢ్, అంభికాపుర్ మున్సిపాలిటీ అధికారులు 'పారిశుద్ధ్యం- పరిశుభ్రత'పై వినూత్నంగా ప్రచారం చేశారు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 'పుష్ప' సినిమాలోని 'మై జుకేగా నహీ'(నేను ఎవరికీ తలవంచను) అన్న డైలాగ్‌ను గోడలపై రాసి వినూత్న పద్ధతిలో ప్రచారానికి తెరలేపారు. అయితే, రోడ్డుపై చెత్త కనబడితే తీసి చెత్తకుండీల్లో వేయాలని ప్రచారం చేస్తున్నారు. హిట్ సినిమాల్లోని డైలాగ్‌లు ప్రజలకు త్వరగా చేరువవుతాయని అందువల్ల ఇలా వినూత్నంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని అంభికాపుర్ మున్సిపాలిటీ మేయర్ డాక్టర్. అజయ్ టిర్కీ తెలిపారు. సినిమా డైలాగ్‌లతో ఇలా ప్రయోగాలు చేయడం దేశంలో ఇదే తొలిసారని అన్నారు టిర్కీ.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST