ETV Bharat / sukhibhava

నెల రోజులు మద్యం తాగడం ఆపేస్తే - మీ బాడీలో ఏం జరుగుతుంది?

Health Benefits of Don't Drink Alcohol : ఒకప్పుడు ఏ పండగకో, పబ్బానికో మద్యం తాగేవారు. అది కూడా వయసులో పెద్దవాళ్లే తీసుకునేవారు. కానీ.. ఇప్పుడు వయసు, కాలంతో సంబంధం లేకుండా విపరీతంగా ఆల్కహాల్ సేవిస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఓ నెలపాటు మద్యం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Health Benefits of Don't Drink Alcohol
Health Benefits of Don't Drink Alcohol
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 3:42 PM IST

Benefits of not Taking Alcohol for a Month : మద్యం తాగడం ఇప్పుడు కామన్ విషయంగా మారిపోయింది. అయితే.. అది తాత్కాలికంగా ఆనందాన్నిచ్చినా.. భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారి ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది. ఇలాంటి వారు ఒక్క నెల రోజులు మందు మానేస్తే.. ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెరుగైన నిద్ర : మీరు ఎప్పుడైతే ఆల్కహల్ తాగడం ఆపేస్తారో.. కేవలం కొన్ని రోజుల్లోనే మీ బాడీలో మార్పులు కనిపిస్తాయి. అందులో మీరు గమనించాల్సిన మొదటి మార్పు.. మెరుగైన నిద్ర. ఆల్కహాల్ సేవించే వారిలో నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఒక నెలపాటు మద్యం తాగడం బంద్ చేశారంటే.. ఎక్కువ విశ్రాంతితో కూడిన నిద్ర పోతారు. దాంతో మీ శక్తి స్థాయిలు పెరగడంతోపాటు ఏకాగ్రత సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఫలితంగా.. ముందుకంటే ఉత్సాహంతో పని చేస్తారు.

బరువు తగ్గడం : మద్యం తాగకపోవడం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం.. బరువు తగ్గడం. మీరు నెలరోజులు మందు తాగకపోతే హెల్తీగా ఉండడంతో పాటు వెయిట్ లాస్ అవుతారు. మీరు నిత్యం ఆల్కహాల్ తాగుతున్నట్టయితే అందులోని కేలరీలు శరీరంలోకి చేరిపోతుంటాయి. అప్పుడు మన బాడీ.. లోపల ఉన్న కొవ్వు తగ్గించడం కన్నా.. ఆల్కహాల్ ద్వారా వచ్చిన దానిని జీర్ణం చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంది. దాంతో.. బరువు పెరిగిపోతారు. కాబట్టి.. మందు తాగకపోతే బరువు తగ్గడం మొదలవుతారు.

కాలేయం పనితీరు : ఆల్కహాల్ ద్వారా అతిగా ఎఫెక్ట్ అయ్యేది లివర్. ఇప్పుడు తాగడం మానేస్తే.. కాలేయ రిలాక్స్ అవుతుంది. ఈ నెల రోజుల గ్యాప్​లో అది పాడయిపోయిన భాగాన్ని.. రీజనరేట్ చేసుకుని మునుపటిలాగా మారేందుకు ప్రయత్నిస్తుంది. జీవక్రియ సాఫీగా సాగడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. దెబ్బతిన్న భాగాన్ని బాగు చేసుకోవడానికి దానికి టైమ్ ఇవ్వడం చాలా అవసరం.

మానసిక ప్రయోజనాలు : ఆల్కహాల్ ఒక నెలరోజులు మానేయడం ద్వారా శారీరక ప్రయోజనాలకు మించి.. మానసిక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా మానసిక స్థితి మెరుగపడుతుంది. ఎమోషనల్ స్టెబిలిటీ స్థాయిలు పెరుగుతాయి. దీంతో.. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. మెరుగైన పనితీరు కనబరుస్తారు.

సామాజిక మార్పు : మీరు ఒక నెల పాటు మద్యపానానికి దూరంగా ఉండాలనే నిర్ణయం.. మీ సర్కిల్స్​లో మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్కహాల్ లేకుండా సోషలైజింగ్ మొదట్లో సవాలుగా అనిపించినప్పటికీ.. తర్వాత వ్యక్తులతో మంచి సంబంధాలు నెలకొల్పుతుంది. మరింత అర్ధవంతమైన చర్యలకు, చర్చలకు దారి తీస్తుంది. మీపై రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. ఇవే కాకుండా.. మద్యం మానేయడం మీ దీర్ఘకాలిక జీవనశైలిలో ఎంతో మార్పు తెస్తుంది. ఈ టైమ్​లో మీరు మంచి పోషకాహారం తీసుకుంటూ.. డైలీ వ్యాయామం లాంటివి చేశారంటే.. మీలో మీకు కొత్త వ్యక్తి కనిపిస్తాడు. గతం కన్నా ఫిట్​గా ఉంటారు. ఇలా మీ జీవితం సంతోషకరమైన మార్గంలోకి టర్న్ తీసుకుంటుంది!

Liver Problem Remedies In Telugu : అతిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారా?.. కాలేయం దెబ్బతినే ప్రమాదముంది.. జాగ్రత్త!

'మద్యం తాగుతున్నారా? అయితే త్వరగా ముసలివారు అయిపోతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.