ETV Bharat / sports

యువ ఆటగాళ్ల కోసం 'ఆనంద్​' చెస్​ అకాడమీ - ఆర్​ వైశాలి

దేశంలోని యువ ఆటగాళ్లకు చెస్​ శిక్షణ ఇచ్చేందుకు..​ ఓ అకాడమీ ప్రారంభించనున్నట్లు తెలిపాడు ప్రపంచ మాజీ ఛాంపియన్, ప్రముఖ చెస్​ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. వెస్ట్​బ్రిడ్జ్​ క్యాపిటల్​ సంస్థ భాగస్వామ్యంలో ఈ అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు.

Anand to launch academy to train youngsters
చెస్ అకాడమీ ప్రారంభించనున్న విశ్వనాథ్ ఆనంద్
author img

By

Published : Dec 11, 2020, 5:34 AM IST

యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్, ప్రముఖ చెస్​ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఓ చెస్​ అకాడమీ ఏర్పాటు చేయనున్నాడు. వెస్ట్​బ్రిడ్జ్ క్యాపిటల్​ సంస్థ భాగస్వామ్యంతో ఈ అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు.

'వెస్ట్​బ్రిడ్జ్-ఆనంద్ చెస్​ అకాడమీ' పేరుతో దేశంలోని టాప్​ 5 యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనున్నాడు విశ్వనాథన్ ఆనంద్. ఈ జాబితాలో.. చెస్ ఫెలోషిప్ అర్హత పొందిన పి ప్రజ్ఞానంద(15), నిహాల్ సరిన్(16), రౌనక్ సాధ్వాని(15), డి గుకేష్(14), ప్రజ్ఞానంద సోదరి ఆర్​ వైశాలి(19) ఉన్నారు.

Anand to launch academy to train youngsters
విశ్వనాథన్​ ఆనంద్

"గత 20 ఏళ్ల నుంచి చెస్ ఆటకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలో మంచి సామర్థ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే ప్రపంచ ఛాంపియన్​లుగా, టాప్​ 10 ఆటగాళ్లుగా నిలుస్తారు".

-విశ్వనాథన్ ఆనంద్, చెస్ క్రీడాకారుడు.

వర్చువల్​గానే..

అకాడమీ ప్రారంభించినా కొవిడ్-19 దృష్ట్యా కొద్దిరోజులపాటు వర్చువల్​గానే శిక్షణ ఇవ్వనున్నాడు ఆనంద్. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లు మరింత నైపుణ్యం సంపాదించొచ్చని భావిస్తున్నాడు.

వెస్ట్​బ్రిడ్జ్ కాపిటల్ సహవ్యవస్థాపకుడు సందీప్​ సింగ్​.. ఆనంద్​తో కలిసి చెస్ అకాడమీ ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ అకాడమీతో ప్రపంచ చెస్​ పోటీల్లో భారత్​ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని అన్నాడు. శిక్షణలో ఆనంద్​కు సహకారం అందించేందుకు కొందరు విదేశీ ఆటగాళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్​లో ఖరీదైన కెప్టెన్​గా ధోనీ.. విలువ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.