ETV Bharat / sports

విరాట్​, గంభీర్​ మధ్య ఏం జరిగింది?.. పూసగుచ్చినట్టు చెప్పిన ప్రత్యక్ష సాక్షి! - కోహ్లీ గంభీర్ వాగ్వాదం

Virat Kohli vs Gautam Gambhir : శనివారం విరాట్​ కోహ్లీ, గౌతమ్​ గంభీర్​ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం క్రీడా వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ ఘటన జరిగేటప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి.. సోమవారం రాత్రి అసలు ఏం జరిగిందో, ఇద్దరు ఏం తిట్టుకున్నారో పూసగుచ్చినట్లు చెప్పాడు.

Kohli vs Gambhir
Kohli vs Gambhir
author img

By

Published : May 2, 2023, 8:38 PM IST

Updated : May 2, 2023, 9:01 PM IST

Virat Kohli vs Gautam Gambhir : ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా సోమవారం బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ ప్లేయర్ విరాట్​ కోహ్లీ, లఖ్​నవూ జట్టు మెంటర్​ గౌతమ్ గంభీర్​ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బెన్​ స్టోక్స్​ అనే ఉచ్ఛారణ కలిగిన ఓ బూతు పదాన్ని పరస్పరం తిట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన క్రికెట్​ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనిపై భిన్నాభ్రిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది దీన్ని చిన్న పిల్లల చేష్టలుగా కొట్టిపారేస్తున్నారు. మరికొందరు వారి ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని ఓ మసాలా సీన్​లా ఎంజాయ్​ చేస్తున్నారు. ఈ జెంటిల్​మెన్​ గేమ్​ను విశ్వసించే, ప్రేమించే వారు.. క్రికెట్​లో ఇలాంటివి జరగకుడదని భావిస్తున్నారు.

ఆ రాత్రి ఏం జరిగింది?
సోమవారం జరిగిన ఘటన గురించి మరిన్ని వివరాలు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. "మ్యాచ్​ ముగిశాక లఖ్​నవూ ప్లేయర్​ మేయర్స్​, విరాట్​ కోహ్లీ నడుచుకుంటూ కొన్ని మీటర్ల దూరం వెళ్లడం మీరు టీవీలో చూశారు. ఆ సమయంలో.. ఎందుకు నిరంతరం దుర్భాషలాడుతున్నావు? అని మేయర్స్​.. కోహ్లీని ప్రశ్నించాడు. దీంతో నువ్వు ఎందుకు నా వైపు చూస్తున్నావు? అని కోహ్లీ సమాధానమిచ్చాడు. పరిస్థితి చేజారుతుందని గమనించిన గౌతమ్ గంభీర్​.. మేయర్స్​ను​ పక్కకు నెట్టి.. విరాట్​తో సంభాషణ చేయద్దని అన్నాడు. మిగతా ప్లేయర్లు పక్కకు తీసుకెళ్లే ముందు ఇద్దరి మధ్య ఈ వాగ్వాగం జరిగింది. అంతకుముందు, విరాట్..​ నవీన్​ ఉల్​ హక్​ను దుర్భాషలాడుతున్నాడని అమిత్​ మిశ్ర అంపైర్​కు ఫిర్యాదు చేశాడు" అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Virat Kohli
అమిత్​ మిశ్రతో మాట్లాడుతున్న విరాట్​ కోహ్లీ

ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం.. ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది..

  • గంభీర్ : ఏం చెప్తున్నావో చెప్పు(క్యా బోల్ రహా హై బోల్)?​
  • విరాట్​ : నేను మీకు ఏం చెప్పలేదు. మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు?.
  • గంభీర్​ : నువ్వు మా ప్లేయర్​ను దుర్భాషలాడావు. అంటే మా కుటుంబాన్ని దుర్భాషలాడినట్టే.
  • విరాట్​ : అయితే మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
  • గంభీర్​ : అయితే, ఇక నుంచి నేను నిన్ను చూసి నేర్చుకోవాలి.

వాగ్వాదానికి దిగి.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గౌతమ్ గంభీర్​, విరాట్​ కోహ్లీపై జరిమాన విధించింది ఐపీఎల్​ యాజమాన్యం. ఈ మేరకు ట్వీట్​ చేసిన ఐపీఎల్​.. వారి మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించింది. లఖ్​నవూ ప్లేయర్​ నవీన్​ ఉల్​ హక్​పై కూడా 50 శాతం ఫైన్​ విధించారు.

2013లోనూ ఇదే తంతు..
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. 2013 సీజన్‌లో కోల్​కతాతో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఇద్దరి మధ్య వైరం అలానే నడుస్తోంది.

Last Updated : May 2, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.