2015 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయాన్నందుకున్న న్యూజిలాండ్ అదే రీతిలో నేడు భారత్‌పై గెలిచింది. ఈ విజయంతో కివీస్ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత్‌తో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో నెగ్గింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
-
After a game like that, all you can do is shake hands and say, 'Well played' 🤝#INDvNZ | #CWC19 pic.twitter.com/sZMBMCTtWO
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">After a game like that, all you can do is shake hands and say, 'Well played' 🤝#INDvNZ | #CWC19 pic.twitter.com/sZMBMCTtWO
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019After a game like that, all you can do is shake hands and say, 'Well played' 🤝#INDvNZ | #CWC19 pic.twitter.com/sZMBMCTtWO
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా(77), ధోని(50) పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 3 వికెట్లతో ఆకట్టుకున్న హెన్రీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
టాపార్డర్ టపాటపా...
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్(1), కోహ్లీ(1), రాహుల్(1) వికెట్లను వరుసగా చేజార్చుకుంది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేశాడు హెన్రీ, కాసేపటికే విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు బౌల్ట్. తర్వాతి ఓవర్లోనే రాహుల్‌ను వెనక్కి పంపాడు హెన్రీ. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోహ్లీ సేన.
-
See you at Lord's! 👍 #CWC19 | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xTOQ953Zch
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">See you at Lord's! 👍 #CWC19 | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xTOQ953Zch
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019See you at Lord's! 👍 #CWC19 | #BACKTHEBLACKCAPS pic.twitter.com/xTOQ953Zch
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019
నిలకడగా ఆడిన పంత్ - పాండ్య..
కాసేపు దినేశ్ కార్తీక్ - పంత్ నిలకడగా ఆడారు. అయితే నీషమ్ అద్భుత క్యాచ్‌తో కార్తీక్(6) ఔట్ అయ్యాడు. అనంతరం పంత్(32), పాండ్య(32) జోడి నిలకడగా ఆడింది. స్కోరు వేగంగా కదలకపోయినా.. వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయారు. అయితే సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్(32) బౌండరీలైన్లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే పాండ్య కూడా అదే రీతిలో సాంట్నర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.
జడ్డూ అర్ధశతకం వృథా..
పాండ్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా వేగంగా ఆడాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు ధోని స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడ్డూకు సహకరించాడు. సాంట్నర్ బౌలింగ్‌లో సిక్సర్లతో విరచుకు పడ్డాడు జడేజా. 59 బంతుల్లోనే 77 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతూ బౌల్ట్ బౌలింగ్‌లో విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
-
And, that's a 100-run partnership between MS Dhoni and Jadeja#TeamIndia 192/6 after 45.3 overs pic.twitter.com/mKwP5MpNvw
— BCCI (@BCCI) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And, that's a 100-run partnership between MS Dhoni and Jadeja#TeamIndia 192/6 after 45.3 overs pic.twitter.com/mKwP5MpNvw
— BCCI (@BCCI) July 10, 2019And, that's a 100-run partnership between MS Dhoni and Jadeja#TeamIndia 192/6 after 45.3 overs pic.twitter.com/mKwP5MpNvw
— BCCI (@BCCI) July 10, 2019
మలుపు తిప్పిన ధోని రనౌట్..
జడేజా ఔటైనా..క్రీజులో ధోని ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అప్పుడు భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి. 49వ ఓవర్లో సిక్సర్‌తో బ్యాట్ ఝుళిపించిన మహీ.. అనంతరం రనౌటయ్యాడు. మూడో బంతికి షాట్ ఆడిన ధోని ఒక్క పరుగు పూర్తి చేశాడు. రెండో రన్ దాదాపు పూర్తవుతుండగా గప్తిల్ వేసిన త్రో వికెట్లను నేరుగా తాకింది. ధోని పెవిలియన్ చేరాడు. అనంతరం భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.
-
The decisive moment. What a throw from Martin Guptill!#CWC19 | #INDvNZ pic.twitter.com/YADbNi2VOu
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The decisive moment. What a throw from Martin Guptill!#CWC19 | #INDvNZ pic.twitter.com/YADbNi2VOu
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019The decisive moment. What a throw from Martin Guptill!#CWC19 | #INDvNZ pic.twitter.com/YADbNi2VOu
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019
నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన సెమీస్ మ్యాచ్ బుధవారం కొనసాగింది. 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. రాస్ టేలర్(74), విలియమ్సన్(67) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. మిగతా వారు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.