ETV Bharat / international

కొత్తగా ఎగిరే రోజులు రానేవచ్చాయి!

విమానయానంలో మనం సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా విమానాశ్రయాలు, విమానాల్లోనూ వినూత్న విధానాలు అమల్లోకి రావడం అనివార్యం. మరి రానున్న కాలంలో ప్రయాణాలు, ప్రమాణాలు ఎలా ఉండబోతున్నాయి?

IMPACT OF COVID ON AVIATION
కొత్తగా ఎగిరే రోజులు రానేవచ్చాయి!
author img

By

Published : May 18, 2020, 6:49 AM IST

కొవిడ్‌ కమ్మేసిన ప్రపంచంలో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి.. ఎప్పుడు ప్రారంభమైనా విమానాలు, విమానాశ్రయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి తావులేని చర్యలు తప్పనిసరి. సురక్షిత ఆరోగ్యకర ప్రయాణానికి అనుగుణంగా అనేక మార్పులు, చేర్పులు తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రయాణికులకు భరోసా కల్పించేలా చేపట్టాల్సిన చర్యలపై విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు దృష్టిసారించాయి. ఈ మేరకు వివిధ అంశాలపై నిపుణులు అంచనాలు ఇలా ఉన్నాయి.

పరీక్షలు.. ప్రశ్నావళి

విమాన ప్రయాణం చేయాలంటే తొలుత రక్త పరీక్షలు లేదా ముక్కులోంచి నమూనాలు సేకరించడం తప్పనిసరి కావచ్చు. దుబాయ్‌లో రక్త పరీక్షలను ఏప్రిల్‌లోనే తప్పనిసరి చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం తేల్చేస్తారు. హాంకాంగ్‌ కూడా ఇక్కడకు వచ్చే అందరు ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలను తప్పనిసరి చేసింది. అమెరికా, ఇటలీ వంటి ఎక్కువ ముప్పున్న దేశాల నుంచి వచ్చే వారికి టోక్యోలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

* కెనడాలో ఓ విమానయాన సంస్థ ప్రయాణికులకు వారి ఆరోగ్యానికి సంబంధించి ఓ ప్రశ్నావళిని నింపడం తప్పనిసరి చేసింది. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు శానిటైజర్‌ వంటి వాటితో కూడిన ఓ కిట్‌ కూడా ఉండాల్సిందే.

మాస్క్‌ పెట్టుకోవాల్సిందే..

ప్రయాణం మొత్తంగా ముఖాన్ని కప్పిఉంచడం (ఫేస్‌ కవరింగ్‌) తప్పనిసరి కానుంది. కెనడాలో మాస్కుల్లేకపోతే అనుమతించడం లేదు. సిబ్బందికీ తప్పనిసరి చేయొచ్చు.

క్రిమినాశక బూత్‌లు.. రోబోలు..

ప్రయాణికులను పూర్తిగా శానిటైజ్‌ చేసేందుకు క్రిమినాశక బూత్‌లు రావొచ్చు. ఇప్పటికే హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40 సెకన్లలో ఆపాదమస్తకం పిచికారీ చేసేలా ప్రయోగాలు ప్రారంభించారు. బహిరంగ ప్రాంతాలను అతినీల లోహిత కిరణాలతో శుభ్రంచేసే రోబోలు కూడా సేవలందిస్తాయి.

రద్దీ వరుసలుండవ్‌!

ప్రయాణికులంతా భౌతిక దూరాన్ని పాటించాల్సిన పరిస్థితుల్లో చెక్‌ఇన్‌ వంటి ప్రక్రియలకు వరుసలు పెడితే దాదాపు కి.మీ. మేర క్యూ లైన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా లోపలికి వెళ్లే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రయాణికులకు వారి సమయం వచ్చినప్పుడు ఫోన్‌కు మెసేజ్‌ పంపుతారు. తదనుగుణంగా వారు వెళ్లాల్సి ఉంటుంది.

ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు..

విమానాశ్రయాల్లో ఇక గుర్తింపు కార్డుతో పాటు, రోగనిరోధక ధ్రువపత్రం లేదా హెల్త్‌ సర్టిఫికెట్‌ కూడా చూపించాల్సి రావొచ్చు. ఇప్పటికే థాయ్‌లాండ్‌ దీన్ని అమలుచేస్తోంది. కొత్తగా ఐఏటీఏ ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్టు’ వంటివాటికి ప్రతిపాదిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ‘యెల్లో ఫీవర్‌ కార్డు (వ్యాక్సినేషన్‌ చేయించుకున్నట్లు ధ్రువీకరించే పత్రం)’లను ప్రయాణికులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ఇలా ఉండొచ్చని అంచనా.

శానిట్యాగింగ్‌..

తీసుకెళ్లే లగేజీలను విమానాల్లోకి ఎక్కించే ముందు యంత్రాలతో వాటంతట అవే శానిటైజ్‌ కావడం లేదా అతినీల లోహిత కాంతితో క్రిమినాశకంగా తయారయ్యే విధానం కూడా రానుంది. ఇలాచేసిన తర్వాత వాటికి ట్యాగింగ్‌ చేస్తారు. దీన్నే ‘శానిట్యాగింగ్‌’ అని పిలుస్తున్నారు. విమానం దిగిన తర్వాత అదే లగేజీ బెల్ట్‌పైకి చేరుతుంది.

మరింత ముందుగా వెళ్లాలి..

ప్రయాణికులు, వారి లగేజి కూడా శానిటైజ్‌ చేయాల్సి రావడంతో పాటు, ఆరోగ్య పరీక్షలు వంటివి కూడా చేసే యోచనలో ఉండటంతో ఇకపై చెకింగ్‌, బోర్డింగ్‌ ప్రక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో చాలా ముందుగా విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని విమానయాన కంపెనీలు, విమానాశ్రయాల్లో ఈ ప్రక్రియ కోసం 4 గంటలు ముందుగా వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరికొన్ని..

  • * శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా చూస్తారు. ఇందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలు అమరుస్తారు. పోర్టోరికోలో థర్మల్‌ కెమెరాలు పెట్టారు. శరీర ఉష్ణోగ్రత 100.3 డిగ్రీలు (ఫారన్‌హీట్‌) దాటగానే అలారం మోగుతుంది.
  • * విమానాల్లో సీట్ల వెనుక ఉండే ప్యాకెట్లను తొలగించి ఖాళీగా ఉంచొచ్చు.
  • * వినోదానికి సంబంధించి ఇక టచ్‌స్క్రీన్‌లు ఉండకపోవచ్చు. వీటికి బదులు సొంత వినోద సాధనాలను అనుమతించవచ్చు.

భౌతికదూరం పాటించేలా..

విమానాల లోపల భౌతిక దూరం పాటించేలా కొత్త డిజైన్లు వస్తాయి. సీటుకు సీటుకు దూరం పెట్టడం; మధ్యలో ఒక సీటును తొలగించడం లేదా వదిలేయడం; ప్రతి కుర్చీకీ ఎత్తైన పారదర్శక అట్టలు అమర్చడం వంటి డిజైన్లపై విమానయాన సంస్థలు దృష్టి సారించాయి. ఇటలీలోని ఓ ప్రముఖ విమాన డిజైన్‌ సంస్థ ఓ సరికొత్త డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. మూడు సీట్లుండే వరుసలో మధ్య సీటును వెనక్కు తిప్పేసి(వ్యతిరేక దిశలో) ఏర్పాటు చేయడమే ఈ విధానం. మూడు సీట్లకు మధ్య పారదర్శక డివైడర్లను కూడా అమరుస్తారు. విమానాలను రీ డిజైన్‌ చేయకుండా సీటుకు సీటుకు మధ్య చుట్టూ ఎత్తైన ‘ప్రొటెక్టివ్‌ షీల్డ్‌’లు అమర్చడాన్ని ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త ‘ఎస్‌డీఎఫ్‌’ క్లాస్‌..

విమానాల్లో ఫస్ట్‌ క్లాస్‌, బిజినెస్‌ క్లాస్‌, ఎకానమీ వంటి ప్రయాణ తరగతులుండటం అందరికీ తెలిసిందే. ఇకపై ‘సోషల్‌-డిస్టెన్స్‌-ఫ్రెండ్లీ’ క్లాస్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో భౌతిక దూరంపై అవగాహన పెరగడంతో ఇతరులకు దూరంగా ఏకాంతంగా కూర్చోవాలని కొందరు భావించవచ్చు. అలాంటివారి కోసం చిన్న గదులతో ఈ ‘ఐసొలేషన్‌ క్లాస్‌’లు కూడా రావొచ్చని అంచనా.

తాకనే తాకరు..

విమానాశ్రయ టెర్మినళ్లలో ఏ ప్రక్రియకూ ఇక మనుషులను తాకడం అనేది ఉండదు. ప్రయాణికులను చెక్‌ చేసేందుకు, వారి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు.. అలాగే బయోమెట్రిక్‌ చెక్‌-ఇన్‌ను పూర్తిగా టచ్‌లెస్‌ కియోస్క్‌ల ద్వారానే చేయవచ్చు. ఫేస్‌ రికగ్నిషన్‌ విధానంలో ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియను చేపట్టవచ్చు. ఇది ఇప్పటికే చాలాచోట్ల అమలవుతోంది. ప్రయాణికులు కూడా తమ వస్తువులను తప్ప దేన్నీ తాకాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లుంటాయి.

ఎగరడం ఇక ప్రియం

విమానాల్లో కొత్త డిజైన్లతో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో చాలాచోట్ల విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచే అవకాశం ఉందని ఐఏటీఏ అంచనా వేస్తోంది. భౌతిక దూరం కారణంగా ఒక్కో విమానంలో ప్రయాణికుల సగటును కుదించుకోవాల్సి రావచ్చని, డిజైన్‌ కూడా తదనుగుణంగా మారుతుందని అంచనా వేసింది.

వేడి ఆహారం మర్చిపోవడమే..

చాలా విమానయాన సంస్థలు ఆహార సేవలను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంది. వేడి వంటకాలకు బదులు ముందుగానే ప్యాక్‌చేసి, శీతలీకరించిన భోజనాలను అందించొచ్చు. లోపల కప్పులతో నీళ్లు అందించడానికి బదులు, ప్రయాణికులు సొంతంగా నీళ్ల సీసాలను ముందే తీసుకురావాల్సి ఉంటుంది. విమానం ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ భోజనాలను టచ్‌లెస్‌ వెండింగ్‌ మెషీన్ల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ను లెక్కచేయని మంత్రులు- భారీ ర్యాలీ నిర్వహణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.