ETV Bharat / entertainment

నటి రోజాకు అవమానం.. షోకు పిలిచి ఇలా చేస్తారా అంటూ ఆవేదన - గెటప్​ శ్రీను దశవతారం గెటప్​

జబర్దస్త్​కు దూరమైన నటి రోజా తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్​లో పాల్గొని సందడి చేశారు. అయితే అక్కడ ఆమెకు అవమానం జరిగింది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ స్టేజ్​ దిగి వెళ్లిపోయారు.

roja insulted
రోజాకు అవమానం
author img

By

Published : Sep 26, 2022, 5:00 PM IST

Updated : Sep 26, 2022, 5:28 PM IST

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను బాగా అలరించారు సీనియర్​ నటి రోజా. టాలీవుడ్​లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించారు. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకున్నారు. అలాగే బుల్లితెర షో అయిన జబర్దస్త్​లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకున్నారు.

అయితే రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల ఈ షో నుంచి తప్పుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో రోజాను ఇకపై షోల్లో కనిపించరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆమె త్వరలోనే దసరా పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్​లో ప్రసారం కానున్న ఓ ప్రత్యేక షో ద్వారా కనువిందు చేయనున్నారు. ఇటీవలే దసరా వైభవం పేరుతో దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో భాగంగానే రోజాను స్టేజీపై ఘనంగా సన్మానించారు.

అయితే తాజాగా రెండో ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో ఆ సన్మానం అనంతరం ఏమైందో తెలియదు గానీ.. రోజా స్టేజ్​పైనే కన్నీరు పెట్టుకున్నారు. 'ఏం మాట్లాడుతున్నావ్​.. నన్ను పిలిచింది అవమానించడానికా, ప్లాన్​ చేసుకుని ఇలా చేయాలని అనుకున్నారా' అంటూ ఏడుస్తూ స్టేజ్​పై నుంచి వెళ్లి పోయారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే అక్టోబర్​ 5న షో ప్రసారం అయ్యేవరకు వేచి ఉండాల్సిందే. అయితే ఈ ప్రోమో మాత్రం ఆద్యంతం ఆసక్తిగా, నవ్వులు పూయిస్తూ సాగింది. ఇందులో గెటప్​ శ్రీను కమల్​హాసన్​ దశావతారం గెటప్​లలో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే హైపర్​ ఆది, శ్రీముఖి కామెడీ కూడా అందర్నీ బాగా నవ్వించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: స్పెషల్​ షోతో బుల్లితెరపై రోజా రీఎంట్రీ.. ఎందులో అంటే?

Last Updated : Sep 26, 2022, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.