ETV Bharat / business

ఆర్థిక రాజధానే కాదు.. కోటీశ్వరులకు ఆవాసం కూడా! - కోటీశ్వరుల కుటుంబాలు ఇండియా

India millionaire households: కోటీశ్వరులైన కుటుంబాలకు ఆవాసం కల్పిస్తున్న విషయంలో ముంబయి నగరం ముందు వరుసలో ఉంది. ముంబయికి చెందిన 20,300 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో చేరాయి.

mumbai millionaire households
mumbai millionaire households
author img

By

Published : Feb 19, 2022, 8:20 AM IST

India millionaire households: దేశ ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న ముంబయి.. కోటీశ్వరులైన కుటుంబాలకు ఆవాసం కల్పిస్తున్న విషయంలోనూ ముందుంది. అక్కడ 20,300 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో చేరగా.. వాటి కనీస నికర విలువ రూ.ఏడు కోట్లుగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో దిల్లీ(17,400), కోల్‌కతా(10,500) నిలిచాయి. ఈ విషయాన్ని హురన్‌ ఇండియా వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది. ఆ కుటుంబాలు పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఆధారంగా..ఈ జాబితాను సిద్ధం చేసింది.

Mumbai millionaire households:

ఇక దేశవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన కుటుంబాల సంఖ్య 4,58,000 చేరినట్లు ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది కంటే 11 శాతం వృద్ధి కనిపించింది. అలాగే రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 30 శాతం పెరిగి, 6 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంతేగాకుండా ఈ మిలియనీర్ల బ్రాండ్ల వాడకం, అలవాట్లు, జీవనశైలి తీరును వివరించింది. వారిలో 36 శాతం మంది ఇ-వ్యాలెట్లు లేక యూపీఐ పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నారని పేర్కొంది. గత ఏడాది ఆ వాటా 18 శాతమే.

  • సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది పన్ను చెల్లించడం సామాజిక బాధ్యతను నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది దాతృత్వాన్ని బాధ్యతగా భావించారు.
  • ఈ మిలియనీర్లకు వాచ్‌ల సేకరణ హాబీ. రోలెక్స్ ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్‌.
  • ఆతిథ్య బ్రాండ్‌లలో తాజ్‌కు మొదటి ప్రాధాన్యం. ఈ తర్వాత స్థానాల్లో ఒబెరాయ్‌, లీలా ఉన్నాయి. ఆభరణాల విషయంలో తనిష్క్‌ వైపే మొదటగా చూసేదని తెలిపింది.

ఇదీ చదవండి: జీవితాంతం వ్యక్తిగత ప్రమాద బీమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.