Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఆ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ లో చూడొచ్చు.
ఫస్టియర్‌లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు టాప్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 62.85 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు మంత్రి చెప్పారు.
బాలికలు ప్రథమ సంవత్సరం 68.68శాతం, బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించగా... ద్వితీయ సంవత్సరం బాలికలు 71.57శాతం, బాలురు 55.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని మంత్రి తెలిపారు. రేపటి నుంచి ఈనెల 16 వరకు రీ కౌంటింగ్, రీ వాల్యూయేషన్ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ రాసే విద్యార్థులంతా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని మంత్రి కోరారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
సాయంత్రం నుంచి మెమోలు కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చు: విద్యార్థుల కోసం టెలీ మానస్ హెల్ప్ లైన్ 14416 నెంబర్ ఏర్పాటు చేసినట్లు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చని చెప్పారు. ఇంటర్ ఫలితాల కోసం పాస్‌వర్డ్ TIRN@23 గా పేర్కొన్నారు. సాయంత్రం నుంచి మెమోలు కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చని నవీన్ మిత్తల్ వెల్లడించారు.
ఇవీ చదవండి: