ETV Bharat / state

అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు - దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త! - CURTAINS AROUND ALLU ARJUN HOUSE

అల్లు అర్జున్​ ఇంటివద్ద కట్టుదిట్ట భద్రత - విద్యార్థుల సంఘాలు దాడి చేసిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

ALLU ARJUN HOUSE
అల్లు అర్జున్​ ఇంటి చుట్టూ పరదాల ఏర్పాటు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 3:32 PM IST

Curtains installed Around Allu Arjun House : ఒకవైపు చిక్కడపల్లిలోని పోలీస్​ స్టేషన్​లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్నప్పుడే ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ ముగిసింది. అనంతరం తన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. దీంతో ఆయన ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఏలాంటి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటిపై జేఏసీ సంఘాల దాడి : ఓయూ జేఏసీ నాయకుల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన విషయం అందిరికీ తెలిసిందే. మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తు నినాదాలు సైతం చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లను కూడా విసిరేశారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్‌ ఇంటి ఆవరణలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై సీఎం రేవంత్​ రెడ్డి దాడిని ఖండిస్తూ తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. సీని ప్రముఖుల ఇళ్లపై ఇలాంటి దాడులు జరగడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. ఆ తరువాతి రోజు వారికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది.

విచారణకు రండి - అల్లుఅర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు

'అల్లు అర్జున్ చెప్పింది అబద్ధం - శ్రీతేజ్​కు ఇచ్చింది రూ.10లక్షలే, 25లక్షలు కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.