ETV Bharat / bharat

NHRC ఛైర్మన్​గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి రామసుబ్రమణ్యం నియామకం - NHRC NEW CHAIRMAN

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణ్యం నియామకం

NHRC New Chairman
NHRC New Chairman (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 7:20 PM IST

NHRC New Chairman : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1న అప్పటి N.H.R.C ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్ కుమార్‌ మిశ్ర పదవీ విరమణ చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకూ N.H.R.C సభ్యురాలు విజయభారతి సయానీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఆ పదవిలో కొనసాగారు.

N.H.R.C చేపట్టనున్న జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం న్యాయవిద్యను మద్రాస్‌ న్యాయ కళాశాలలో పూర్తి చేశారు. మద్రాస్‌ హైకోర్టులో సుమారు 23 ఏళ్లు ప్రాక్టీస్‌ చేసిన జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం, అనంతరం మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగిన ఆయన అదే ఏడాది జూన్‌ 22న హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్‌ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జూన్‌ 29న జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం పదవి విరమణ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.