ETV Bharat / bharat

'నో డిటెన్షన్‌' విధానం రద్దు- ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే! - NO DETENTION POLICY

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం - 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్‌ విధానం రద్దు

No Detention Policy In Education
No Detention Policy In Education (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

No Detention Policy In Education : పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'నో డిటెన్షన్‌' విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది.

విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. 'గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు' అని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే ఈ నిబంధన కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మూడ వేల పాఠశాలలకు వర్తించనుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 'ఇందులో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌డం అనేది రాష్ట్రాల వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం. ఇప్పటికే దిల్లీతో సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి' అని ఉన్నతాధికారి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.