ETV Bharat / bharat

TDP Nyayaniki Sankellu program : 'న్యాయానికి సంకెళ్లు'.. బాబుకు మద్దతుగా మరో నిరసన కార్యక్రమానికి టీడీపీ పిలుపు - TDP Kanthitho Kranthi Programme

TDP calls for Nyayaniki Sankellu program tomorrow: చంద్రబాబుకు మద్దతుగా 'న్యాయానికి సంకెళ్లు' పేరిట తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రేపు రాత్రి 7 గం.కు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలని లోకేశ్ టీడీపీ శ్రేణులను కోరారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించండంటూ పేర్కొన్నారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలంటూ తెలిపారు. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

TDP calls for Nyayaniki Sankellu program tomorrow

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:03 PM IST

Updated : Oct 14, 2023, 5:13 PM IST

TDP calls for Nyayaniki Sankellu program tomorrow: న్యాయానికి సంకెళ్లు పేరిట తెలుగుదేశం పార్టీ మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా 'న్యాయానికి సంకెళ్లు' పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు... నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గం.కు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపనున్నట్లు లోకేశ్ తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన తెలపాలని పేర్కొన్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించండంటూ లోకేశ్ టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అభిమానులకు పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. టీడీపీ కొనసాగించే ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ రాష్ట్ర ప్రజలను కోరారు.

TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..

మద్దతుగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు: గత నెల 30వ తేదీ చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం కార్యక్రమాని టీడీపీ పిలుపునిచ్చింది. రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా శబ్ధం చేసి చంద్రబాబుకు మద్దతు తెలపాలని పేర్కొంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్యాలస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినబడేలా నిరసన తెలపాలని కోరింది. ఇంట్లోనో ఆఫీస్​లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండని తెలిపారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ నిరసన తెలపాలని ట్విట‌్టర్‌ ద్వారా పేర్కొన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.

Police cases registered on TDP Motha Mogiddam: మోత మోగిద్దాంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు..!

కాంతితో క్రాంతి అంటూ కదం తొక్కిన చంద్రబాబు అభిమానులు: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిస్తోంది. గత శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకూ కాంతితో క్రాంతి పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని.. చంద్రబాబుతోనే రాష్ట్రానికి కాంతి వస్తుందని తెలిపేలా కార్యక్రమానికి టీడీపీ రూపకల్పన చేసింది. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందనీ.. ఆ చీకటిని తరిమికొట్టే క్రాంతి రావాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి చైతన్యవంతులు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించింది.

ములాఖత్‌ కోసం రాజమండ్రి చేరుకున్న లోకేశ్: ఇప్పటికే చంద్రబాబుతో ములాఖత్ కోసం నారా లోకేశ్ దిల్లీ రాజమహేంద్రవరం చేరుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ ములాఖత్‌కు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. ములాఖత్‌ కోసం జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు... ములాఖత్‌లో కలిసి ఆరోగ్యంపై వాకబు చేయాలని భావిస్తున్నారు.

TDP Kanthitho Kranthi Programme: కాంతితోనే క్రాంతి.. చంద్రబాబుతోనే రాష్ట్రానికి కాంతి వస్తుందని తెలిపేలా..

Last Updated : Oct 14, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.