ETV Bharat / bharat

సీఎం దీపావళి కానుక- విద్యుత్​ ఛార్జీ యూనిట్​కు రూ.3 తగ్గింపు - పంజాబ్​లో తగ్గిన విద్యుత్ ఛార్జీలు

దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను యూనిట్​కు మూడు రూపాయల మేర తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 11శాతం పెంచింది.

Electricity Rates
విద్యుత్ ఛార్జీలు
author img

By

Published : Nov 1, 2021, 6:43 PM IST

పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ ఛార్జీలను యూనిట్​కు మూడు రూపాయలు తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన విద్యుత్ ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు.

ఒక్కో యూనిట్​ ధరను రూ.3 తగ్గించినట్లు సీఎం పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి తక్కువ విద్యుత్​ ఛార్జీలు ఉన్న రాష్ట్రంగా పంజాబ్​ మారిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలు లాభపడతాయని వివరించారు.

ఉద్యోగులకు డీఏ పెంపు..

విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో పాటు.. రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త తెలిపింది పంజాబ్ సర్కార్​. కరవు భత్యం(డీఏ)ను 11శాతం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వెల్లడించారు.

ఇదీ చూడండి: హాకీ మ్యాచ్​లో గోల్​కీపర్​గా సీఎం.. క్రీడా మంత్రికి చుక్కలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.