ETV Bharat / bharat

నివర్​ తుపాను: 3 రాష్ట్రాలకు 25 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు

author img

By

Published : Nov 25, 2020, 12:14 PM IST

Updated : Nov 25, 2020, 7:20 PM IST

Tami Nadu, Puducherry gear up to meet Cyclone Nivar
తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న 'నివర్'

19:18 November 25

  • #WATCH | Tamil Nadu: Visuals from Marina Beach in Chennai as strong winds hit the region, sea turns rough.

    #CycloneNivar is likely to cross between Mamallapuram and Karaikal during midnight today and early hours of 26th November, as per IMD pic.twitter.com/yBqgARoirS

    — ANI (@ANI) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎగసిపడుతున్న అలలు..

నివర్​ తుపాను ప్రభావంతో.. తమిళనాడు చెన్నైలోని మెరీనా బీచ్​లో అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 

17:30 November 25

పెనుతుపానుగా మారిన నివర్​

  • నైరుతి బంగాళాఖాతంలో పెను తుపానుగా మారిన నివర్
  • అర్ధరాత్రికి కడలూర్-మామల్లపురం వద్ద తీరం దాటనున్న నివర్
  • ప్రస్తుతం గంటకు 11 కి.మీ. వేగంతో తీరం వైపునకు వస్తున్న పెను తుపాను నివర్
  • 16 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న నివర్ తుపాను
  • రాగల 3 గంటల సమయంలో చెన్నై, చెంగల్పట్టు, నాగపట్నం, మైలాడుదురై, కడలూరు, విళుపురం, పుదుచ్చేరి, కరైకల్​లో భారీవర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటన

17:18 November 25

నివర్​ ఎఫెక్ట్​- పలు రైళ్లు రద్దు

  • నివర్ తుపాను దృష్ట్యా  దక్షిణమధ్య రైల్వే ముందుజాగ్రత్త చర్యలు
  • ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 7 రైళ్లు రద్దు, 8 రైళ్లు దారి మళ్లింపు
  • చెన్నై, తిరుపతి, రెనిగుంట, పాకాల వైపు  నడపబోయే రైలు సర్వీసులు  ప్రభావితమవుతాయి- ద.మ రైల్వే.
  • ఈ ప్రాంతంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు , సేవలు పరిస్థితి బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయవచ్చు- ద.మ రైల్వే
  • ప్రయాణికులు అందుకు అనుగుణంగా రైలు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ద.మ రైల్వే వినతి
  • 'నివర్' ప్రభావితం అయ్యే విభాగాలలోని అనేక ప్రధాన స్టేషన్లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు - ద.మ రైల్వే
  • రైలు సంబంధిత విచారణ కోసం, ప్రయాణికులు ఫోన్ల నంబర్లను సంప్రదించవచ్చు- ద .మ రైల్వే

17:00 November 25

తుపాను దృష్టా సెలవు..

నివర్ తుపాను కారణంగా రేపు కూడా 13 జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించారు ముఖ్యమంత్రి పళనిస్వామి. 

16:53 November 25

ప్రధాన రహదారుల మూసివేత..

  • నివర్ తుపాను ప్రభావం దృష్ట్యా చెన్నైలోని ప్రధాన రహదారులు మూసివేత
  • మళ్లీ ప్రకటించే వరకు ప్రధాన దారులు మూసివేత: చెన్నై ట్రాఫిక్‌ పోలీస్‌

16:48 November 25

రైళ్ల దారి మళ్లింపు..

నివర్​ తుపాను నేపథ్యంలో ఇప్పటికే 7 రైళ్లను రద్దు చేసిన దక్షిణ రైల్వే... మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోన్నట్లు పేర్కొంది. సంబంధిత జాబితాను వెబ్​సైట్లో ఉంచింది. 

16:43 November 25

మామల్లపురంలో భారీ వర్షాలు..

తమిళనాడు మామల్లపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరింది. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నివర్​ తుపాను మామల్లపురం-కరైకల్​ వద్ద తీరం దాటనుంది. 

16:08 November 25

'3 రాష్ట్రాలకు 25 బృందాలు'

నివర్​ తుపాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్​డీఆర్​ఎఫ్​) అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండనున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్​లకు 25 బృందాలను పంపించినట్లు తెలిపారు ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీ ఎస్​ఎన్​ ప్రధాన్​. కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని.. రెండు రోజులుగా క్షేతస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు. 

తరలింపు..

'నివర్​' దృష్ట్యా.. ముంపు ముంగిట ఉన్న తమిళనాడులోని దాదాపు 30 వేల మంది, పుదుచ్చేరిలోని 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాన్​ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కలిసి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నష్టాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

16:04 November 25

భీకరగాలులు..

తమిళనాడులోని మామల్లపురంలో భీకరగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మామల్లపురం-కరైకల్​ వద్ద ఈరోజు అర్ధరాత్రి తర్వాత.. నివర్​ తుపాను తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 

15:47 November 25

తీవ్ర తుపానుగా నివర్​..

  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్
  • కడలూరుకు 180 కి.మీ., పుదుచ్చేరికి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • గంటకు 11 కి.మీ. వేగంతో తీరం వైపు కదులుతున్న తీవ్ర తుపాను నివర్
  • కొన్ని గంటల్లో పెను తుపానుగా మారుతుందని వెల్లడించిన ఐఎండీ
  • అర్ధరాత్రి తర్వాత కరైకల్-మామల్లపురం వద్ద తీరం దాటుతుందన్న ఐఎండీ
  • తీరం దాటేటప్పుడు గాలుల వేగం 120-145 కి.మీ. ఉంటుందన్న ఐఎండీ
  • తమిళనాడు తీరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి: ఐఎండీ
  • తుపాను ప్రభావం వల్ల నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి: ఐఎండీ
  • రాత్రి నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు
  • రాత్రి నుంచి అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

15:06 November 25

నివర్​ తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూనమల్లే హై రోడ్డు వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై భారీగా వరదనీరు చేరింది. 

14:56 November 25

7 రైళ్లు రద్దు చేసిన దక్షిణ రైల్వే..

నివర్​ తుపాను దృష్ట్యా.. 7 రైళ్లను రద్దు చేసింది దక్షిణ రైల్వే. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. 

14:55 November 25

ఎన్డీఆర్​ఎఫ్​ బలగాల అప్రమత్తం..

  • మరో 6 గంటల్లో అతి తీవ్ర తుపానుగా‌ మారనున్న నివర్
  • కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో నివర్‌ కేంద్రీకృతం
  • రేపు తెల్లవారుజామున మామల్లపురం-కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం
  • సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్  బృందాలు
  • అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నాం: విపత్తుల నిర్వహణ శాఖ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు

14:52 November 25

నివర్​ ఎఫెక్ట్​- ఆ ప్రాంతాల్లో వర్షాలు..

  • తమిళనాడులోని చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో వర్షాలు
  • చెన్నైకి తాగునీరు అందించే చెంబరంబాక్కం ప్రధాన చెరువులో ప్రవాహం
  • చెంబరంబాక్కం ప్రధాన చెరువు పూర్తిగా నిండటంతో నీటి విడుదల
  • తమిళనాడు: ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
  • తమిళనాడులోని 13 జిల్లాల్లో రేపు కూడా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • చెన్నై నుంచి వెళ్లే 26 విమానాలను రద్దుచేసిన అధికారులు

13:51 November 25

నివర్​ తుపాను కారణంగా చెన్నై నుంచి వెళ్లే, వచ్చే మొత్తం 26 విమానాలను రద్దు చేశారు. ఈ మేరకు చెన్నై విమానాశ్రయం తెలిపింది.

13:42 November 25

ఇళ్లలోనే ఉండాలి..

తుపాను కారణంగా ప్రజలను ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కోరారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నాను. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. ఆహారం, మందులు అవసరమున్న 80 ప్రాంతాలను గుర్తించి తగిన సహాయం చేస్తున్నాం. 12 గంటల్లో విద్యుత్​ను పునరుద్ధరిస్తాం.

       - నారణయణస్వామి, పుదుచ్చేరి సీఎం

13:36 November 25

TRAINS CANCEL
రైళ్లు రద్దు

రైళ్ల రద్దు

తుపాను కారణంగా ఈరోజు రెండు, గురువారం మూడు, 28న ఒక రైలును దక్షిణ రైల్వే రద్దు చేసింది.

13:34 November 25

నివర్ తుపాను కారణంగా గురువారం కూడా 13 జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.

13:23 November 25

నది గేట్లు ఎత్తివేత..

వరద నీరు ఎక్కువగా రావడం వల్ల చెంబరంబక్కం చెరువు గేట్లను ఎత్తివేశారు అధికారులు. నీటిని అడయార్​ నదిలోకి విడిచిపెట్టారు అధికారులు. 

13:17 November 25

భారీ వర్షాలు..

తమిళనాడులోని తంజావుర్​, తిరువూర్, నాగపట్నం, కడలూర్, చెన్నై, కాంచీపురం, చెంగల్​పట్టు, మైలదుతైరై, అరియలూర్​, కల్లకుర్చి, విల్లుపురం, తిరువన్నమలై జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్​లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ విభాగం తెలిపింది.

13:06 November 25

ఏర్పాట్లను సమీక్షించిన సీఎం

'నివర్'​ తుపాను తీరాన్ని తాకనున్న నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి.. పలు ప్రాంతాల్లో పర్యటించి సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 

12:25 November 25

"నివర్​ తుపాను క్రమంగా బలపడుతోంది. భారీ వృక్షాలు నేలకూలడం , పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయే అవకాశం ఉంది. అరటి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయి. పుదుచ్చేరి-కరైకల్​పై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది."

       - డా. మృత్యుంజయ మహోపాత్ర, ఐఎమ్​డీ డీజీ

12:20 November 25

తమిళనాడు మామల్లపురంలో బలమైన గాలులు వీస్తున్నాయి. నివర్​ తుపాను ఈరోజు అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.

12:16 November 25

  • Army ready to assist govt & civil administration in Tamil Nadu & Puducherry to face #CycloneNivar, maintaining communication with officials. Twelve humanitarian assistance & disaster relief teams & two engineer task forces ready for deployment: Southern Command, Indian Army pic.twitter.com/CPiHojBap4

నివర్​ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలకు అండగా సైన్యం సిద్ధంగా ఉంది. విపత్తు స్పందన దళాలు సిద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం దక్షిణ కమాండ్​ తెలిపింది.

11:58 November 25

తమిళనాడు తీరం వైపు తీవ్ర తుపాను నివర్ దూసుకొస్తుంది. గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది.

ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. పుదుచ్చేరికి 310 కి.మీ. దూరంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. కొద్దిగంటల్లో పెను తుపానుగా బలపడుతున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. రాత్రికి మామళ్లపురం- కరైకల్ మధ్య తీరం దాటుతుందని స్పష్టం చేసింది ఐఎండీ. ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ. మేర వర్షం పడినట్లు వెల్లడించిన ఐఎండీ. 

Last Updated : Nov 25, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.