Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,167 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 41 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 15,549 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.
- మొత్తం మరణాలు: 5,26,730
- మొత్తం కేసులు: 4,41,61,899
- యాక్టివ్ కేసులు: 1,35,510
- కోలుకున్నవారి సంఖ్య: 4,34,99,659
Vaccination India:
భారత్‌లో ఆదివారం 34,75,330 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 206.56 కోట్లు దాటింది. మరో 2,63,419 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 5,56,051 మంది వైరస్ బారినపడగా.. మరో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,93,03,819కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,36,397 మంది మరణించారు. ఒక్కరోజే 7,25,654 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,05,29,650కు చేరింది.
- జపాన్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 2,14,879 కేసులు నమోదయ్యాయి. 161 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 26,656 కేసులు నమోదయ్యాయి. 74 మంది మరణించారు.
- ఆస్ట్రేలియాలో 22,616 కేసులు నమోదయ్యాయి. 32 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- తైవాన్‌లో 22,044 కరోనా కేసులు బయటపడగా.. 42 మంది మృతి చెందారు.