ETV Bharat / bharat

సీబీఐ మాజీ డైరెక్టర్​పై చర్యలకు కేంద్రం సిఫార్సు

సీబీఐ మాజీ డైరెక్టర్​ అలోక్​ వర్మపై సర్వీస్​ నిబంధనలు అనుసరించి క్రమశిక్షణా చర్యలు తీసకోవాలని కేంద్ర హోంశాఖ సీబీఐ అధికారులకు సిఫార్సు చేసింది. ఆయన సీబీఐ డైరెక్టర్​గా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు లేఖలో పేర్కొంది.

author img

By

Published : Aug 4, 2021, 2:43 PM IST

disciplinary action against Alok Verma
అలోక్​ వర్మపై చర్యలకు కేంద్రం సిఫార్సు

సీబీఐ మాజీ డైరెక్టర్​ అలోక్​ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్రం సిఫార్సు చేసింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి, సర్వీస్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ కోరినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

అలోక్​ వర్మపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), సిబ్బంది శిక్షణ విభాగానికి లేఖ రాసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వర్మపై వచ్చిన అరోపణలు నిజమైతే ఆయన పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్‌లను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయొచ్చని వివరించారు.

అలోక్​ వర్మ సీబీఐలో పనిచేసే సమయంలో 1984 బ్యాచ్‌‌ గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఆస్తానా అవినీతి ఆరోపణలు చేశారు. అయితే అదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మ, డిప్యూటీ డైరెక్టర్​గా ఉన్న రాకేశ్‌ ఆస్తానాపైనా విమర్శలు చేశారు.

"అలోక్​ వర్మ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సర్వీస్​ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఆయన మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది."

- అధికారులు

ఇదీ చూడండి: కంచే చేను మేస్తే.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.