Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 4) రాశి ఫలాల గురించి శంకరమంచి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

ప్రారంభించబోయే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. శివ సహస్రనామ పారాయణ శుభకరం.

ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. శ్రీలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది.

అనుకూలమైన సమయం. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ధర్మసిద్ధి కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. ధర్మకార్యక్రమాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

దైవబలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.

మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.

అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. దైవారాధన మానవద్దు.

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యవిషయాల్లో తోటివారి సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.