భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. మొత్తం కేసులు 50 వేలకు చేరువయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 2,958 మందికి వైరస్ సోకింది. మరో 126 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో మృతుల సంఖ్య 617కు చేరింది. కేసులు 15 వేలు దాటాయి. గుజరాత్లో 368, మధ్యప్రదేశ్‌లో 176, రాజస్థాన్‌లో 89, దిల్లీలో 64 మంది కొవిడ్‌కు బలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో 36, తెలంగాణలో 29 మరణాలు సంభవించాయి.