ETV Bharat / bharat

కరోనాతో దేశంలో ఒకేరోజు 3 రికార్డులు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కొవిడ్​ వ్యాప్తిలో శనివారం ఒకేరోజు 3 రికార్డులు నమోదయ్యాయి. గరిష్ఠ సంఖ్యలో కొత్తగా 7964 కేసులు, 265 మంది మృతి చెందారు. 11,264 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కోలుకున్నవారి శాతం 47కు పెరిగింది.

corona virus
కరోనాతో దేశంలో ఒకేరోజు 3 రికార్డులు
author img

By

Published : May 31, 2020, 6:14 AM IST

కొవిడ్‌ వ్యాప్తిలో శనివారం మూడు కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు, రికవరీలు, మరణాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం (7466) కంటే ఎక్కువగా 24 గంటల్లో 7,964 కొత్త కేసులొచ్చాయి. 265 మంది కన్నుమూశారు. అందులో 116 మంది (43.77%) మహారాష్ట్రవారే. 11,264 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కోలుకున్నవారి శాతం (రికవరీ రేటు) 42.89 నుంచి 47.40కి పెరిగింది. దిల్లీలో రెండ్రోజులుగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కేసుల సంఖ్య 20,000 దాటింది. గుజరాత్‌లో మరణాలు వెయ్యికి చేరువవుతున్నాయి. అసోంలో మే 22న 256 మేర ఉన్న కేసులు వారం రోజుల్లో నాలుగురెట్లు పెరిగిపోయాయి.

వేగం పెరుగుతోంది: ఐసీఎంఆర్‌

దేశంలో కరోనా సంక్రమణ వేగం పెరుగుతోందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలుతున్నవారి శాతం 4.81కి చేరింది. ప్రతి 20.78 మందిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు తేలుతోంది.

పైలట్‌కు పాజిటివ్‌.. వెనక్కి విమానం

విమానం పైలట్లలో ఒకరు కరోనా పాజిటివ్‌ అని ఆలస్యంగా తెలియడంతో శనివారం దిల్లీ-మాస్కో ఎయిరిండియా విమానం అర్థంతరంగా వెనక్కి వచ్చేసింది. 'వందేభారత్‌ మిషన్‌' కింద రష్యా నుంచి భారతీయుల్ని తీసుకువచ్చేందుకు విమానం ఖాళీగా వెళ్తోంది. ఒక పైలట్‌కు కరోనా పాజిటివ్‌ అని గ్రహించిన సిబ్బంది హుటాహుటిన ఆ విమానాన్ని వెనక్కి రప్పించారు. అప్పటికే అది ఉజ్బెకిస్థాన్‌ గగనతలంలో ఉంది. విమాన సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించి, వేరే విమానాన్ని మాస్కోకు పంపారు.

తిరిగివచ్చే కూలీలకు రిజిస్ట్రేషన్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిపోయిన ఇతర రాష్ట్రాల వలస కూలీలు తిరిగి మహారాష్ట్రకు రావాలనుకుంటే వారి పేర్లను నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్‌ చెప్పారు. చాలామంది కట్టుబట్టలతోనే వెళ్లిపోయారని, వారంతా కొన్నిరోజులకు తిరిగొచ్చే అవకాశం ఉందన్నారు.

అంత్యక్రియలకు వెళ్లిన 18 మందికి

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా ఉల్లాస్‌నగర్‌లో అంత్యక్రియలకు వెళ్లిన 18 మంది కరోనా బారిన పడ్డారు. అక్కడ ఒక మహిళ(40) కొవిడ్‌-19 లక్షణాలతో ఇటీవల మరణించింది. కుటుంబ సభ్యులు సంచిని తెరిచి కర్మకాండలు నిర్వహించారు. మే 25న జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది పాల్గొన్నట్లు సమాచారం. వారందరికీ పరీక్షలు చేయగా.. 18 మందికి పాజిటివ్‌ వచ్చింది.

corona virus
రాష్ట్రాల వారిగా కేసుల వివరాలు
corona virus
శనివారం నమోదైన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.