ETV Bharat / bharat

అతడి క్లారిటీ చూసి పోలీసులే షాక్​ అయ్యారు - తాజా వార్తలు కరోనా

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్​ లేని ఈ మహమ్మారిని అరికట్టాలంటే భౌతిక దూరం, జాగ్రత్తలే ఆయుధాలు. వీటిని తప్పకుండా పాటించాల్సిందే. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలిసింది అనడానికి కేరళ కోజికోడ్​లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్​ అవుతోంది.

CORONA
కరోనా
author img

By

Published : Apr 12, 2020, 11:12 AM IST

కరోనా వైరస్‌తో పోరాటానికి భౌతిక దూరం ప్రధాన ఆయుధం. ఆ తర్వాతే శుభ్రత, మాస్కులు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ చేరింది అనడానికి కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ సంఘటన నిదర్శనం. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల పేదలు, ఇల్లు లేని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కోజికోడ్‌లోని ఓ వీధిలో నిరాశ్రయుడైన ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. అతడ్ని చూసిన పోలీసులు భోజనం చేశావా? అని అడిగారు. లేదని పొట్టపై చేయిపెట్టి.. సమాధానం చెప్పడం వల్ల వెళ్లి ఆహార పొట్లం, నీళ్ల బాటిల్‌ తీసుకొని వచ్చారు. అతడికి ఇచ్చేందుకు ముందుకు అడుగు వేయగా.. వెంటనే దూరంగా ఉండమంటూ అరిచాడు. చొక్కా ముఖానికి అడ్డుపెట్టుకుని.. ఇక్కడ పెట్టండని స్థలం చూపించి, దూరంగా నిల్చున్నాడు. పోలీసులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిన తర్వాత అతడు దాన్ని తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇల్లు, సౌకర్యాలు లేని వ్యక్తికి కూడా భౌతిక దూరంపై అవగాహన ఉండటం గొప్ప విషయమని నెటిజన్లు అంటున్నారు. దయతో వ్యవహరించిన పోలీసుల్ని మెచ్చుకుంటున్నారు.

పోలీసులు.. నాకు దూరంగా నిల్చోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.