దేశంలో కరోనా విజృంభణ అంతకంతకూ తీవ్రమవుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే కొత్తగా 909 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది.
వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలోనే ఇప్పటివరకు 127 మంది మృత్యువాత పడ్డారు.
ఛత్తీస్గఢ్లో మరో 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరికి తబ్లీగీ జమాత్తో సంబంధమున్న వారి నుంచి వైరస్ సోకినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25కు పెరిగింది.
మధ్యప్రదేశ్ ఇండోర్లో కొత్తగా 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 298కి చేరగా, ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కల్పోయారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 532 కేసులు నమోదు కాగా, మొత్తం 36మంది మృతి చెందారు.
రాజస్థాన్లో కొత్తగా 51 కేసులు నమోదు కాగా, మరో 9 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 751 చేరింది. మృతుల సంఖ్య 51కి పెరిగింది. రాష్ట్ర రాజధాని జైపుర్లోనే 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.