ETV Bharat / bharat

ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్రదేశాల సరసన భారత్​!

author img

By

Published : May 18, 2020, 9:43 AM IST

Updated : May 18, 2020, 3:26 PM IST

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ పేరిట రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రకటించిన అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీలల్లో భారత్​ ఒకటి. ప్యాకేజీ విలువ స్థూల దేశీయోత్పత్తి 2019-20 (జీడీపీ)లో సుమారు 10 శాతం ఉంది.

Economic Packages:
ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్ర దేశాల సరసన భారత్​!

కరోనాతో కమ్ముకున్న కారుచీకట్లను పారదోలి, స్వయం సమృద్ధి సాధించటమే లక్ష్యంగా ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ పేరిట భారీ ఉద్దీపన చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతంతో రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఎంఎస్​ఎంఈ, వ్యవసాయం, విమానయానం వంటి వివిధ రంగాలకు ఆర్థిక ఉపశమనం కల్పించే అంశాలను 5 విడుతలుగా వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​.

అగ్ర దేశాల సరసన..

ప్రపంచవ్యాప్తంగా పలు అగ్రదేశాలు ప్రకటించిన అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీల్లో భారత్​ ఒకటి కావటం గమనార్హం. భారత్​ కన్నా ముందు వరుసలో జపాన్​, అమెరికా, స్వీడన్​, ఆస్ట్రేలియా, జర్మనీలు ఉన్నాయి.

149 దేశాల జీడీపీ కంటే అధికం

భారత్​ ప్రకటించిన రూ.20 కోట్ల (265 బిలియన్​ డాలర్లు) ప్యాకేజీలో పూర్తిగా కొత్త వ్యయాలు కావు. గతంలో పీఎంజీకేపీ కింద రూ. 1,92,800 కోట్లు, ఆర్బీఐ చర్యల్లోని రూ. 8,01,603 కోట్లు ఉన్నాయి. అయితే భారత ఉద్దీపన ప్యాకేజీ.. వియత్నాం, పోర్చుగల్​, గ్రీస్​, న్యూజిలాండ్​, రొమేనియా వంటి 149 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. పాకిస్థాన్​ వార్షిక జీడీపీ( 284 బలియన్​ డాలర్లు)కి దాదాపు సమానం. జీడీపీ పరంగా ఉద్దీపన చర్యల్లో భారత్​ 6వ స్థానంలో నిలిచింది. 10 మంది అగ్రస్థానంలోని ధనిక భారతీయుల సంపద (147 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే భారత ప్యాకేజీ 1.8 రెట్లు అధికం. భారత్​లో అత్యధిక సంపన్నుడైన ముంఖేశ్​ అంబానీ సంపదతో పోలిస్తే 5 రెట్లు అధికం.

వివిధ దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలు జీడీపీ పరంగా..

atmanirbhar bharat
ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్రదేశాల సరసన భారత్​!
  • అమెరికా.. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో తొలిస్థానంలో ఉంది అగ్రరాజ్యం. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అన్ని దేశాల కంటే భారీ మొత్తంలో సుమారు 2.7 ట్రిలియన్​ డాలర్లుతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అయితే.. జీడీపీ శాతం పరంగా చూస్తే జపాన్​ కంటే అమెరికా వెనకంజలో ఉన్నట్లు ఆర్థికవేత్త సెహున్​ ఎల్గిన్​ రూపొందించిన డేటా ప్రకారం తెలుస్తోంది. అమెరికా జీడీపీలో ప్యాకేజీ 13శాతంగా ఉన్నట్లు అంచనా వేశారు.
  • జపాన్​.. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సుమారు 1.1 ట్రిలియన్​ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది జపాన్​. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 21.1 శాతం ఉంటుంది. ఇతర దేశాలోతో పోలిస్తే ఇదే అధికం. ముందు ముందు మరింత ఎక్కువగా వ్యయం చేయాలని భావిస్తోంది ఆ దేశ ప్రభుత్వం.
  • స్వీడన్​.. దేశ జీడీపీలో 12 శాతం మేర నిధులతో కరోనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది.
  • ఆస్ట్రేలియా.. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీలో 10.8 శాతం నిధులతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
  • జర్మనీ.. ఆర్థిక ప్యాకేజీలో భాగంగా సుమారు 815 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది జర్మనీ. అది జీడీపీలో 10.7 శాతం మేర ఉంటుంది.
  • ఫ్రాన్స్​.. తమ దేశ జీడీపీలో సుమారు 9.3 శాతానికి సమానమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
  • స్పెయిన్​… ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ విలువ దేశ జీడీపీలో సుమారు 7.3 శాతం ఉంటుందని అంచనా.
  • ఇటలీ… కరోనా మహమ్మారితో భారీగా నష్టపోయింది ఇటలీ. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 750 బిలియన్​ యూరోల( 815 బిలియన్​ డాలర్లు) ప్యాకేజీ ప్రకటించింది. అది దేశ జీడీపీలో సుమారు 5.7 శాతం.
  • చైనా.. కరోనా వైరస్​కు కేంద్ర బిందువైన చైనా అన్ని దేశాల కంటే ముందే ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. వైరస్​ వ్యాప్తితో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు దేశ జీడీపీలో 3.8 శాతంతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

Last Updated : May 18, 2020, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.