ETV Bharat / bharat

అంతులేని తల్లి ప్రేమ : 1200 కిలోమీటర్ల ప్రయాణం ఉఫ్​..

మహారాష్ట్ర పుణె జిల్లా పిప్రీ చించావడ్​కు చెందిన దివ్యాంగురాలైన సోను ఖందారే.. లాక్​డౌన్ వేళ.. వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన తన కుమారుడిని వెనక్కి తెచ్చుకునేందుకు సాహసమే చేసింది. 12వందల కిలోమీటర్లు ప్రయాణించి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చింది. అమ్మ ప్రేమకు అంతులేదని మరోసారి రుజువు చేసింది.

mother
అంతులేని తల్లి ప్రేమ : 1200 కిలీమీటర్లు ప్రయాణం ఉఫ్​..
author img

By

Published : May 10, 2020, 7:33 PM IST

Updated : May 10, 2020, 9:34 PM IST

అంతులేని తల్లి ప్రేమ : 1200 కిలోమీటర్ల ప్రయాణం ఉఫ్​..

అమ్మంటే ఒక భరోసా. కోడి తన రెక్కల కింద ఎలా పొదివి పట్టుకుంటుందో.. తన బిడ్డలను కూడా మాతృమూర్తి అలాగే కాపాడుకుంటుంది. తన ఆకలి తీరడం కంటే పిల్లల కడుపు నిండితేనే ఎక్కువ సంతృప్తి చెందుతుంది. బిడ్డలకు ప్రమాదం ఎదురైతే ఉగ్రరూపం దాలుస్తుంది. వారికి సమస్య వస్తే ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర పుణెలో జరిగింది. ప్రస్తుత కరోనా వేళ కుమారుడి కోసం ఓ దివ్యాంగురాలైన తల్లి సాహసమే చేసింది. ఏకంగా 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించింది. కుమారుడిని తనవద్దకు తెచ్చుకుని స్థిమితపడింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమరావతిలో చిక్కుకుపోయిన తన కుమారుడిని తన వద్దకు తెచ్చుకునేందుకు స్కూటీపై వెళ్లింది పుణె జిల్లా పిప్రీ చించావడ్​కు చెందిన సోనూ ఖందారే. వ్యయ ప్రయాసలకు ఓర్చి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

"ఈ ప్రయాణంలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నాలుగుసార్లు నా స్కూటీ టైర్ పంచర్ అయింది. కొన్ని సార్లు నా పెట్రోల్​ అయిపోయేది. కానీ పెట్రోల్ బంక్ అందుబాటులో ఉండేది కాదు. రోడ్డు బాగాలేదు. దుమ్ము, గుంతలమయమై ఉంది. రోడ్డుపై కేవలం ట్రక్కులు, నేను మాత్రమే ఉన్నాం."

-సోనూ ఖందారే

పెట్రోల్​ బంకుల్లోనే కునుకు

పెట్రోల్ బంకుల వద్దే పడుకునే దాన్నని చెప్పింది సోనూ. అక్కడున్న సీసీ కెమెరాలతో భద్రతాపరంగా తోడ్పడతాయనే నమ్మకంతోనే ఇలా పడుకునేదాన్నని వెల్లడించింది. ఈ ప్రయాణంలో తనకు అనేక మంది సహాయపడినట్లు తెలిపింది.

బంధువుల ఇంటికి వెళ్లిన తాను అక్కడ చిక్కుకుపోయినట్లు చెప్పాడు కుమారుడు ప్రతీక్. తనను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎంత కష్టమైనా భరించి అమ్మ వచ్చిందన్నాడు.

"మా బంధువుల కుమార్తెను ఇంట్లో వదలడానికి అమరావతికి వెళ్లాను. లాక్​డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయి వెనక్కి రాలేకపోయాను. ఇక్కడికి వస్తున్నట్లుగా అమ్మ మాకు చెప్పలేదు. నన్ను తీసుకెళ్లేందుకు వాహనాన్ని పంపిస్తున్నానని మాత్రమే చెప్పింది."

- ప్రతీక్ ఖందారే

lockdown
కుమారుడిని వెంటబెట్టుకుని వస్తూ..

ఇదీ చూడండి:'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం!

Last Updated : May 10, 2020, 9:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.