ETV Bharat / bharat

తల నరికి యువకుడి హత్య.. నుపుర్ శర్మకు మద్దతు తెలపడమే కారణం.. మోదీకి వార్నింగ్

Rajasthan murder: రాజస్థాన్ ఉదయ్​పుర్​లో అత్యంత కిరాతక హత్య జరిగింది. ఓ యువకుడ్నిహత్య చేసి తల, మొండెం వేరు చేశారు. మృతుడు కొద్ది రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియో వీడియో పోస్టు పెట్టాడు. హత్య తమపనేనని ఇద్దరు వ్యక్తులు వీడియో విడుదల చేశారు. ప్రధాని మోదీని కూడా చంపుతామని హెచ్చరించారు.

Udaipur murder
నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన యువకుడి దారుణ హత్య.
author img

By

Published : Jun 28, 2022, 6:34 PM IST

Updated : Jun 28, 2022, 10:58 PM IST

Udaipur murder: కొద్దిరోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టిన యువకుడు దారుణ హత్యకు గరుయ్యాడు. ఇద్దరు దుండగులు అతడ్ని కిరాతకంగా నరికి తల, మొండెం వేరు చేశారు. అనంతరం ఈ పని చేసింది తామే అని వీడియో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా హెచ్చరికలు పంపారు. రాజస్థాన్ ఉదయ్​పుర్​లోని మల్దాస్ వీధిలో పట్టపగలే ఈ హత్య జరిగింది. ఘటన జరిగిన ప్రదేశం రక్తపుమడుగులా మారింది.

హత్యకు గురైన వ్యక్తి పేరు కన్నయ్యలాల్​. ధన్​మండీ ప్రాంతంలో టైలర్​గా పనిచేస్తున్నాడు. అతని షాపులోకి ఇద్దరు వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. ఓ వ్యక్తి వద్ద కొలతలు తీసుకున్న తర్వాత కన్నయ్యపై అతడు కత్తితో దాడి చేశాడు. మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్​పై పారిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఖండించిన సీఎం: ఈ దారుణ ఘటనను రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఖండించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్​ మీడియా షేర్​ చేయవద్దని కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. కేసు విచారణను అత్యంత వేగంగా జరుపుతామని హామీ ఇచ్చారు. చట్టంప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ హత్యను తీవ్రంగా ఖడించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి కిరాతక చర్యలతో సమాజంలో భయానక వాతవరణం సృష్టించాలనుకుంటున్న వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలన్నారు. మతం పేరుతో దారుణాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అందరం ఐకమత్యంగా ఉండి విద్వేషాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా హత్యను ఖండించారు.

ఇద్దరూ అరెస్ట్​: ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్లు ఉదయ్​పుర్ ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బైక్​పై హెల్మెట్లు ధరించి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. రాజ్​సమద్ వద్ద గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా.. ఉదయ్​పుర్ జిల్లాతో పాటు రాజస్థాన్ వ్యాప్తంగా 24 గంటలపాటు అంతర్జాల సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

టైలర్ హత్య అనంతరం ఉదయ్​పుర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. హత్య చేసిన వారిని అరెస్టు చేసి మృతుడి కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దుకాణాలను మూసివేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. రాష్ట్రమంతా అలర్ట్ ప్రకటించారు.

రంగంలోకి ఎన్ఐఏ...
హత్య వెనక ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను కేంద్ర హోంశాఖ రంగంలోకి దించింది. ఎన్ఐఏకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందాన్ని హుటాహుటిన ఉదయ్​పుర్​కు పంపించింది.

ఇదీ చదవండి: రెండున్నరేళ్ల బాలుడ్ని బలిచ్చిన తాంత్రికుడు.. ఆస్తిపై కన్నేసి..

Last Updated : Jun 28, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.