ETV Bharat / snippets

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 8:25 AM IST

source ETV Bharat
janvi kapoor (source ETV Bharat)

Devara JanhviKapoor New Movie : జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో నటిస్తూనే మరో ప్రాజెక్టులోనూ నటిస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించనుందట. సుధాంశు సరియా తెరకెక్కిస్తున్న స్పై థ్రిల్లర్ 'ఉలఝ్' మూవీలో ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఆఫీసర్​గా కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 2న థియేటర్లలోకి ఈ మూవీ రానున్నట్లు జాన్వీ తన సోషల్​మీడియాలో వెల్లడించింది. దేశభక్తుల కుటుంబానికి చెందిన ఓ మహిళ అనుకోని పరిస్థితుల్లో దేశద్రోహం ఆరోపణ కేసులో ఇరుక్కుంటుంది. అందులో నుంచి ఎలా బయటపడిందనేదే మిగిలిన కథాంశం. ఈ బాలీవుడ్ సినిమాలో ఆమెతో పాటుగా రోషన్ మాథ్యూ, గుల్షన్ దేవయ్య, అదిల్ హుస్సేన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌లో వినీత్ జైన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.