ETV Bharat / state

గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఫిబ్రవరిలో పరీక్ష ఫలితాలు విడుదల! - GROUP1 MAIN EXAM RESULTS

ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదల - యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ - నోటిఫికేషన్‌ ఇచ్చిన సంవత్సరంలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు

GROUP1 MAIN EXAM RESULTS 2024
Group-1 Results In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 7:26 AM IST

Group-1 Results In Telangana : తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన మెయిన్ పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన సంవత్సరంలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్-1లో అమలు చేసి ఫిబ్రవరి 19 లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్ పరీక్షల జవాబుల పత్రాల మూల్యాంకాన్ని టీజీపీఎస్సీ మొదలు పెట్టింది. మూల్యాంకనం, మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని కమిషన్ భావిస్తోంది.

గ్రూప్-1 పోస్ట్​లకు పరీక్షలు : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్ట్​లకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19 నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి 4,03,645 మంది ధరఖాస్తు చేశారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31, 382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతించిన అభ్యర్థులతో కలిపి మొత్తం 31, 403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్ల పరీక్షలు రాశారు. అభ్యర్థుల జవాబుల పత్రాల మూల్యాంకనం నవంబర్ రెండో వారంలో మొదలు పెట్టారు.

ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం మొదటిసారి మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు రెండోసారి మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్ద తేడా లేకుంటే కొనసాగిస్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఎన్ని వచ్చాయో తెలుపుతారు. ఆ తర్వాత మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందిస్తుంది.

గ్రూప్‌-1 తర్వాతే మిగతా పోస్టులు : గ్రూప్స్‌ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుంది. ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల్లో ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయి. గురుకులాల్లో అయితే ఏకంగా 2 వేల పోస్టులదాకా మిగిలిపోయాయి. భవిష్యత్తులో ఇలా బ్యాక్‌లాగ్‌ కాకుండా చూసేందుకు రీలింక్విష్‌మెంట్‌ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవలె మంత్రి మండలి టీజీపీఎస్సీకి సూచించింది. దీంతో గ్రూప్స్‌ జాబ్స్​లో అవరోహణ విధానం అమలుపై కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-3 రాతపరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నెల డిసెంబర్​లో గ్రూప్‌-2 రాతపరీక్షలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్‌-1 ఫలితాలు ఇచ్చిన తరువాతే గ్రూప్‌-2, 3 ఫలితాలిస్తే బ్యాక్‌లాగ్‌ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్‌ భావిస్తోంది.

గ్రూప్‌-4 ఉద్యోగాల జాబితా : రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా, రాష్ట్రస్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్‌ పంపించింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్రస్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను మొదలుపెట్టింది. వారం, పదిరోజుల్లో తుది పరిశీలన పూర్తిచేసి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

మెయిన్స్​కు ముందు 'టెస్ట్​' చేసుకుంటే బెటర్ - గ్రూప్స్‌ అభ్యర్థులకు భారంగా నమూనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.