అత్తాకోడళ్లు ఒకరికొకరు తినిపించుకుంటే నో బిల్! ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ - Womens Day Special Offers 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 6:29 PM IST
Womens Day Special Offers 2024 : అత్తా కోడళ్ల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమిళనాడు ఈరోడ్‌లోని ఓ రెస్టారెంట్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అత్తాకోడళ్లు ఒకరికొరు ఆహారాన్ని తినిపించుకుంటే ఎలాంటి బిల్లు కట్టనవసరం లేదని ఆఫర్ ప్రకటించింది. వారు తిన్న ఆహారాన్ని ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 18 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది.
"2018 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. అనేక మంది అత్తాకోడళ్లు ఎంతో ఆసక్తిగా ఇందులో పాల్గొంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య ప్రేమ సంబంధాలను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య ఉన్న సమస్యలు తొలిగిపోయి, ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం." అని రెస్టారెట్ యజమాని భూపతి తెలిపారు.
ఒకేసారి పరీక్ష రాసిన అత్తాకోడళ్లు
కొన్ని రోజుల క్రితం బిహార్‌లో అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్షకు హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత పథకం 'అక్షర్ అంచల్ యోజన' కింద పెట్టిన పరీక్షకు ఇద్దరు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి