బెల్జియంలో ఘనంగా భారతీయ మహిళల ఉమెన్స్ డే వేడుకలు - International Womens Day 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 11, 2024, 5:21 PM IST
|Updated : Mar 11, 2024, 5:50 PM IST
Women's Day Celebrations 2024 In Belgium : ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 8న జరిగిన ఈ వేడుకలను విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలు కూడా ఉత్సాహంగా జరుపుకున్నారు. యూరప్‌లోని బెల్జియం దేశంలోనూ స్థానిక భారతీయ మహిళలు ఒక్కటయ్యారు. లూవెన్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్‌కు స్థానిక భారతీయ మహిళలు హాజరయ్యారు.
రోజంతా సరదాగా, సందడిగా సాగిన ఈ వేడుకలను స్థానికంగా ఉన్న జోత్స్న గబ్బిరెడ్డి, కాజల్ పటౌడి నిర్వహించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ మహిళలు, వ్యాపార రంగంలో ఉన్న వారు, తమ అనుభవాలను, గృహిళులు తమ అభిరుచులను, స్థానిక అంశాలను సమావేశంలో పాలుపంచుకున్నారు. కొందరు విదేశీ మహిళలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. మహిళా దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో కొందరు మహిళలు నృత్య, గానాల్లో తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ అలరించారు.