మద్యం షాపుపై మహిళల దాడి - యువత భవిష్యత్ కోసం నాంది - Womens Attack on Liquor Shop - WOMENS ATTACK ON LIQUOR SHOP
🎬 Watch Now: Feature Video


Published : Apr 12, 2024, 4:33 PM IST
Womens Attack on Liquor Shop in Adilabad : గ్రామాల్లో మద్యం ఎక్కువగా దుకాణాల్లో కంటే బెల్టు షాపుల్లోనే దందా నడుస్తోంది. వీటి ద్వారా యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయని భావించిన మహిళలు వాటిపై ఉక్కుపాదం మోపారు. నేరుగా ఆ గ్రామంలో ఉన్న బెల్టు షాపులపై దాడి చేసి మద్యాన్ని నాశనం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
Villagers Attack on Liquor Shop in Adilabad : స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామ గ్రామంలో మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం మత్తులో మునిగి యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గ్రహించారు. దీంతో గ్రామశివారులో విక్రయిస్తున్న బెల్టు దుకాణాలపై దాడి(Women Attack Liquor Shop) చేసి నిల్వ ఉంచిన మద్యాన్ని ధ్వంసం చేశారు. ఆ షాపులో ఉన్న లిక్వర్ను నేలపాలు చేశారు. ఇకపై మద్యాన్ని విక్రయిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. తమ గ్రామ యువకులు కల్తీ మద్యానికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.