ఓటు హక్కుపై వినూత్న ప్రచారం- ఊరేగింపులో ప్లకార్డులతో కొత్త జంట- పెళ్లి మండపంలో కూడా! - Voting Right Awareness In Marriage - VOTING RIGHT AWARENESS IN MARRIAGE
🎬 Watch Now: Feature Video
Published : Apr 1, 2024, 9:30 AM IST
Voting Right Awareness In Marriage : ఛత్తీస్గఢ్ బాలోద్ జిల్లా అడెజార్ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి ఊరేగింపులో వధూవరులతో పాటు వారి బంధువులు ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. అంతేకాకుండా పెళ్లి మండపంలో కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ పోస్టర్లను అతికించారు.
ఈ వివాహానికి లోక్‌సభ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన గ్రీన్ కమాండో వీరేంద్ర సింగ్ హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఓటు హక్కు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లాలో ఓటింగ్ శాతం పెంపునకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలోద్ జిల్లాలో 100 శాతం ఓటింగ్ నమోదు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని వీరేంద్ర సింగ్ పెళ్లికి వచ్చిన వారందరినీ కోరారు. ఈ సందర్భంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఓటరు అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం.