హయత్‌నగర్‌లో సినీ నటి నభా నటేశ్ సందడి - సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ అభిమానులు - Nabha Natesh Launched Digital Store - NABHA NATESH LAUNCHED DIGITAL STORE
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 8:19 PM IST
Nabha Natesh Launched Digital Store in Hayathnagar : ప్రముఖ హీరోయిన్ నభా నటేశ్ హయత్‌నగర్‌లో సందడి చేశారు. ఆర్టీసీ సూపర్‌వైజర్స్ కాలనీ ఎదురుగా ఉన్న భగత్ విలేజ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. డిజిటల్ స్టోర్‌కు చేరుకున్న ఆమెకు అభిమానులు, సిబ్బంది స్వాగతం పలికారు. నభా నటేశ్ రాకతో యువత కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. అభిమాన హీరోయిన్‌ను చూసేందుకు నగరవాసులు గుమిగూడారు. సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
Heroin Nabha Natesh in Hayathnagar : ఈ సందర్భంగా పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను హీరోయిన్ పరిశీలించారు. డిజిటల్ స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. హయత్‌నగర్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని, అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నభా కోరారు. ఈ డిజిటల్ స్టోర్ ఉత్పత్తులు "పర్సనలైజింగ్ టెక్నాలజీ" నినాదానికి అనుగుణంగా ఉన్నాయని, వినియోగదారులకు సరసమైన ధరల్లో సాంకేతిక ఎంపికల ప్రపంచాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.