LIVE : తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు - చిన్న శేష వాహనంపై ఊరేగింపు - Tirumala Chinna Sesha Vahanam Live - TIRUMALA CHINNA SESHA VAHANAM LIVE
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2024, 8:27 AM IST
|Updated : Oct 5, 2024, 10:04 AM IST
Tirumala Chinna Sesha Vahanam Live : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వేళ వేదమంత్రాలు, మంగళ వాద్యాలు నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Last Updated : Oct 5, 2024, 10:04 AM IST