LIVE : మీడియా పాయింట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం - LIVE FROM ASSEMBLY MEDIA POINT - LIVE FROM ASSEMBLY MEDIA POINT
🎬 Watch Now: Feature Video
Published : Jul 25, 2024, 1:53 PM IST
|Updated : Jul 25, 2024, 2:01 PM IST
Telangana Assembly తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు ఉందని, ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లని, రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు, వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, ఉద్యానశాఖకు రూ.737కోట్లు, పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు బడ్జెట్ సమావేశం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు బడ్జెట్ 2024-25 పై తమ స్పందనను తెలియజేశారు.
Last Updated : Jul 25, 2024, 2:01 PM IST