LIVE : తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం - Telangana Governor Jishnu Dev Verma - TELANGANA GOVERNOR JISHNU DEV VERMA
🎬 Watch Now: Feature Video
Published : Jul 31, 2024, 5:02 PM IST
|Updated : Jul 31, 2024, 5:12 PM IST
Telangana Governor Jishnu Dev Verma Swearing Program Live : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే కొత్త గవర్నర్తో రాజ్ భవన్లో ప్రమాణం చేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాల్గో గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, అసెంబ్లీ స్పీకర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఆ పార్టీ సభ్యులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఇవాళ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు త్రిపుర రాజధాని అగర్తలా నుంచి జిష్ణు దేవ్ వర్మ కుటుంబ సభ్యులతో కలిసి బయలు దేరి, మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం అయిన జిష్ణు దేవ్ వర్మ, ప్రస్తుత ఇంఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో విచ్చేశారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990 ప్రారంభంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య డిప్యూటీ సీఎంగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
Last Updated : Jul 31, 2024, 5:12 PM IST