LIVE : 'అమరావతి, పోలవరం పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం'- MLC అనూరాధ ప్రెస్మీట్ ప్రత్యక్ష ప్రసారం - TDP MLC Panchamurthi Anuradha - TDP MLC PANCHAMURTHI ANURADHA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 1:05 PM IST
|Updated : Jun 18, 2024, 1:14 PM IST
TDP MLC Panchamurthi Anuradha Press Meet LIVE : రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యమని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. ఈ అంశం పై ఎమ్మెల్సీ మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారులను నిలదీశారు. పనుల దిశగా ముందడుగు వేస్తున్నారని, నిర్మాణమే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మీడియా సమావెేశం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jun 18, 2024, 1:14 PM IST