ETV Bharat / state

కేంద్ర జలశక్తి మంత్రితో నిమ్మల భేటీ - పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు - CENTRAL MINISTER ON POLAVARAM

గడువులోగా పోలవరం పూర్తికి సహకరిస్తామని కేంద్రమంత్రి పాటిల్ హామీ

Minister Nimmala Meets Central Jalashakthi Ministe
Minister Nimmala Meets Central Jalashakthi Ministe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 9:56 PM IST

Minister Nimmala Meets Central Jalashakthi Minister : పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని సీఆర్ పాటిల్ తెలిపారన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సదస్సుకు హాజరైన నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్​ని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు నిమ్మల చెప్పారు.

2027 నాటికి పోలవరం పూర్తి! : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయ, సహాకారాలు అందిస్తున్నందుకు సీఆర్ పాటిల్​కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మూడు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వర్క్ షెడ్యూల్ విడుదల చేశారని నిమ్మల గుర్తుచేశారు. 2025 డిసెంబర్ నాటికి డయా ఫ్రంవాల్ నిర్మాణం, 2027 డిసెంబర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు, ఏజెన్సీలతో సీఎం రివ్యూలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.

మూడో కట్టర్​తో పనులు : డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయని తెలిపారు. మార్చి నుండి మూడో కట్టర్​తో పనులు చేపడతామని వెల్లడించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణానికి సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలుపెట్టేలా, అవసరమైన డిజైన్స్, సీడబ్ల్యూసీ నుంచి త్వరగా వచ్చేలా సహాకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా నిమ్మల విజ్ఞప్తి మేరకు త్వరలో పోలవరం సందర్శనకు వస్తానని సీఆర్‌ పాటిల్ తెలిపారు.

ఆ వివరాలను ప్రతి నెలా కేంద్రానికి : డీ వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టేలా సహాయ సహాకారాలు అందించాలని నిమ్మల విజ్ఞప్తి చేశారు. గ్యాప్-1లో ఇప్పటికే డివాల్ నిర్మాణం పూర్తయ్యిందని, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో కూడిన పోలవరం ప్రాజెక్టు ప్రగతి, నిర్మాణ పనుల వివరాలను ప్రతి నెలా కేంద్రానికి పంపిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి 'ఆఫ్రి' ప్రత్యేక డిజైన్

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాష్ట్రపతి ముర్ము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.