ETV Bharat / state

వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని డబ్బులతో ఉడాయించిన ఉద్యోగి - SECRETARIAT EMPLOYEE CHEATING

రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని నగదు వసూలు - అనంతరం సచివాలయ ఉద్యోగి పరారీ

village_secretariat_employee_cheated_farmers_in_prakasam_district
village_secretariat_employee_cheated_farmers_in_prakasam_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 12:50 PM IST

Village Secretariat Employee Cheated Farmers in Prakasam District : రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసిన సచివాలయ ఉద్యోగి అదృశ్యమయ్యాడు. దీనిపై నిందితుడి బాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి మండలం బసిరెడ్డిపల్లికి చెందిన సీహెచ్‌ నాగరాజు అనే రైతు చందలూరు సచివాలయంలో ఉద్యానశాఖ సహాయకునిగా పని చేస్తున్న దూపాటి జాన్‌గార్డన్‌కు ఈ నెల 2న రొటోవేటర్‌ నిమిత్తం రూ.72,500 నగదు చెల్లించారు. ఈ మేరకు రొటోవేటర్‌ (Rotavator)ను ఈ నెల 17 లోగా అందజేయకపోతే నగదు తిరిగి ఇచ్చేస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.

గడువు ముగిసిన తర్వాత అతడికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోందని, అతడు ఇంతకుముందు చాలా మంది రైతుల నుంచి ఇలాగే నగదు వసూలు చేసి పరారయ్యాడని ఆయన ఆరోపించారు. దీనిపై కొందరు రైతులు పోలీసులను ఆశ్రయించటంతో ఆ ఉద్యోగి బంధువు బాధిత రైతులతో మాట్లాడి నగదు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల మిగిలిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ ఉద్యోగి పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు.

కేసు నమోదు : నిందితుడు జాన్‌ గార్డన్‌ ఆచూకీ లేదని బుధవారం అతని బాబాయి ఎలీషా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యాపారంలో వాటా ఇస్తానని నమ్మించాడు - అందినకాడికి దోచుకున్నాడు

'వ్యవసాయం చెయ్యడానికి పొలం చదును కోసం, వివిధ పనులకు పలు పరికరాలు​ ఎంతో అవసరం. ఈ క్రమంలోనే జాన్​ రాయితీతో రొటోవేటర్​ ఇప్పిస్తానంటే అతడికి రూ. 72 వేల నగదు ఇచ్చాను. అవి కూడా అప్పు చేసి మరీ అతడికి ఇచ్చాను. కానీ అతడు మోసం చేశాడు. ఎన్ని సార్లు అడిగినా వాయిదా వేసుకుంటూ వచ్చాడు. చివరకు ఫోన్​ స్విచ్​ఆఫ్​ చేసుకుని పరారయ్యాడు. దయచేసి అతడి ఆచూకీ తెలుసుకుని నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాను.' - నాగరాజు, బాధిత రైతు

అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.