టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ - ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు - District Collector Become a Teacher - DISTRICT COLLECTOR BECOME A TEACHER
🎬 Watch Now: Feature Video
Published : Jul 13, 2024, 12:34 PM IST
Collector Changed Into Teacher : విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే కలెక్టర్ ఒక్కసారిగా టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ అరుదైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా పాలనాధికారే తమకు పాఠాలు చెప్పడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లాలో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్నందన్లాల్ పవార్.
ఆ క్రమంలోనే తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. చాక్‌పీస్, డస్టర్ తీసుకుని ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. దీంతో అక్కడే ఉన్న అధికారులు, లెక్చరర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన విద్యార్థులకు ఏం పాఠాలు బోధించారో తెలుసా? 35 నిమిషాల పాటు ఫిజిక్స్‌లోని ఫార్ములాలు సులభంగా ఏ విధంగా గుర్తించుకోవాలి అనే విషయాన్ని విద్యార్థులకు బోధించారు. స్వయంగా కలెక్టరే తమకు పాఠాలు చెప్పడం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.