జీవో 55 రద్దు చేయాల్సిందే - వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు - Agriculture University strike
🎬 Watch Now: Feature Video


Published : Feb 2, 2024, 2:11 PM IST
Rajendranagar Agriculture University Students Protest : రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు హైకోర్టు నిర్మాణానికి అప్పగించొద్దంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ, ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు వర్సిటీ ముందు 25వ రోజు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు పరీక్షకు వెళ్తుండగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో సెకండియర్ విద్యార్థులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
జీవో 55 రద్దు చేసేంత వరకు వర్సిటీలో పరీక్షలు జరపవద్దని ఆందోళన చేస్తున్న విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల కోసం కొట్లాడి అధికారంలోకి వచ్చిన నాయకులు, ఇప్పుడు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించవద్దు అంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేశారు. ప్రొఫెసర్లను బయటికి పంపించిన విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.