ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్‌తో కలిసి నకిలీ కరెన్సీ ముద్రణ - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు - Fake Currency in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Apr 12, 2024, 7:52 PM IST
Police Seized Fake Currency in Hyderabad : హైదరాబాద్‌లో నకిలీ నోట్లు ముద్రణ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు రూ.17 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గంగరాజు అనే యువకుడు ఫేస్బుక్లో పరిచయమైన సచిన్ పవార్, సురేశ్‌లతో కలిసి నకిలీ నోట్ల (Fake Currency)ను ముద్రిస్తున్నాడు. వారు సుమారు రూ.17 లక్షలు ముద్రించి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్స్ ద్వారా చలామణి చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో తమిళనాడుకు చెందిన రవితో చలామణి చేసేందుకు డీల్ కుదుర్చుకునేందుకు వెళ్లాడు.
Police Arrest Fake Currency Makers : బెంగళూరులో డీల్ కుదరకపోవడంతో గంగరాజు హైదరాబాద్ వచ్చాడు. రాజేంద్రనగర్‌లో మరో వ్యక్తితో డీల్ కుదుర్చుకునేందుకు వెళ్లాడు. ఈ విషయం పోలీసులు తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అనంతరం నిందితుల మధ్య డీల్ జరుగుతుండగా వారిని ఎస్వోటీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులు నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ముద్రించారు. మిగతాదంతా మక్కీగా ప్రింట్ చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దందాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.