మల్లన్న సాగర్‌కు నీటి పంపింగ్ నిలిపివేత - 11రోజుల్లో 4.2టీఎంసీలు వదిలిన అధికారులు - mallanna sagar reservoir - MALLANNA SAGAR RESERVOIR
🎬 Watch Now: Feature Video


Published : Aug 20, 2024, 5:23 PM IST
Officials Stopped Water Pumping to Mallanna Sagar : సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల పంపింగ్ నిలిపేసినట్లు డీఈఈ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2024-2025 సంవత్సరానికి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 11రోజుల పాటు పంపింగ్ ద్వారా మల్లన్న సాగర్‌లోని నీళ్లు విడుదల చేసినట్లు తెలిపారు.
మొదటి 5 రోజులు నాలుగు పంపుల ద్వారా 5200 క్యూసెక్కులతో 0.45టీఎంసీల నీరు, తరువాత ఆరు రోజుల పాటు మూడు పంపుల ద్వారా 3900 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్‌లోకి వదిలారని వివరించారు. 11రోజుల పాటు మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి 4.25 టీఎంసీల నీటిని పంపిణీ చేశారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి 2.70టీఎంసీల నీటిని తరలించడం జరిగిందని వెల్లడించారు. నీటిని పంపిణీ చేసిన అనంతరం ప్రస్తుతం రిజర్వాయర్‌లో 10.10 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.